|
|
|
|
Articles: Short Stories | పోరాటం - Editor
| |
ఏమోరా! రేపేం జరగనుందో అనే ఆందోళనతోనే ప్రతిరోజూ మన ఊళ్ళల్లో రోజులు గడుస్తున్నాయి భారంగా అన్నాడు సుబ్బారావు.
ఆలోచిస్తున్న శివకు చిన్నప్పటినుండి తమ ఊరి జీవితం కళ్ళముందు కదలాడసాగింది. వ్యవసాయం ప్రధానంగా ఉండే తమ చుట్టు పక్కల ఊళ్ళన్నీ తమందరికీ కొట్టిన పిండే. సైకిల్ నేర్చుకున్న కొత్తలో బాలకోటి, రాంబాబు, శ్రీను, రహీం తామంతా కలిసి సైకిళ్ళేసుకొని ఊరి బయట గుడి ద్గగర బయల్దేరి లోపలున్న ఊళ్ళన్నీ చుట్టపెట్టి రావడం ఎంత బాగుండేది! ప్రతి ఊరిలోని ప్రతి వ్యక్తి దాదాపు తమందరికీ పరిచయమే. దారి పొడవునా పలకరింపులు, జాగ్రత్తగా వెళ్లమనే హెచ్చరికలు. ఈ పది, పదిహేను ఊళ్ళల్లోకి కాస్త పెద్ద ఊరు తమదే కావడం, ఆ ఊళ్ళ పిల్లలంతా హైస్కూలుకు తమ ఊరే రావడంతో దాదాపు అన్ని ఊళ్ళూ ఎరుకలో ఉండేవి.
ఏ ఒకరో, ఇద్దరో తప్ప అంతా చిన్న కమతాల రైతులే కావడంతో దాదాపు పిల్లలంతా సెలవురోజుల్లో పొలం పనులు చేయడం అలవాటుగానే ఉండేది. అవసరమైతే పనులు ఒత్తిడిగా ఉంటే బడి ఎగ్గొట్టి మరీ పొలం పనులు పూర్తి చేసేవాళ్ళు. ఆఖరికి నిరుడు కూడా పండించిన ధాన్యం బండిమీద ఇంటికి చేర్చింది తనే. తన కాలేజీ ఫీజుకోసం నాన్న ధాన్యాన్ని షావుకారుకు అమ్మడానికి బండిమీద తోలుకొచ్చిన ధాన్యం షావుకారు కొట్లో దింపుతుంటే తన మనసెంత గిలగిలలాడిందని! తన తల్లి, తండ్రి రెక్కలు ముక్కలయ్యేలా కష్టించిన ఫలితమిది. షావుకారుకు అమ్మి, ఆ డబ్బును తండ్రి సరాసరి తెచ్చి తన చేతిలో పెడుతూంటే తనకు కలిగిన దు:ఖం మరువగలడా! అలాంటిది ఇప్పుడు తమకు అన్నం పెట్టిన భూమే ఉండదంటే తనకే ఇంత బాధగా ఉంది, మరి అమ్మానాన్న ఆ కోతను ఎలా భరిస్తున్నారో!
ఆలోచనల్లో పడి నిద్రలోకి జారుకున్నాడు. శివ నిద్ర లేచిన తర్వాత టిఫిన్ చేస్తుండగా బాలకోటి వడివడిగా వచ్చాడక్కడికి. వస్తూనే 'శివ! వెళ్దాంరా' అంటూ బయల్దేరదీశాడు..
ఎక్కడికిరా ఇంత పొద్దున్నే అంటున్న శివ మాట పట్టించుకోకుండా ఆటోను స్పీడుగా ఊరి మొదటనున్న గ్రామదేవత గుడి వద్దకు పోనిచ్చాడు. ఆ గుడి నుండి లోపలికి దాదాపు పదిహేను ఊర్లున్నాయి. ఆ ఊళ్ళకు వెళ్ళాలంటే ఇటునుంచే వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళే సరికే రాంబాబు వాళ్ళంతా అక్కడున్నారు. దూరంగా ప్రభుత్వ కార్లు, పోలీసు జీపులు వరుసగా వస్తూ కన్పించాయి. ఇంతలో విషయం తెలుసుకున్న గ్రామాల్లోని జనం గుడిసెంటర్లో గుమిగూడటం మొదలుపెట్టారు. పైకి కన్పించని ఉద్రిక్తత ఒక్కసారిగా చోటు చేసుకుంది.
కార్ల బారును గుడిసెంటరు వద్దే ఆపిన గ్రామస్తులకు, అధికారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం మొదలయ్యింది. పంచాయితీ ఆఫీసులోనే మేం మీతో మాట్లాడతాం, ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండని అధికారులు, మీరు మా గ్రామాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ గ్రామస్తులు. జరుగుతున్నదంతా చూస్తున్న భూసేకరణ స్పెషలాఫీసర్ కారు దిగి వచ్చి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ముందుకొచ్చి చుట్టుముట్టిన మహిళలు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇంతలో ఒక మహిళ గట్టిగా 'భూముల్ని వదిలిపొమ్మని చెప్పేకంటే మా అందరికీ ఇంత పురుగుల మందు గొంతుల్లో పోసి, మేం చచ్చాక మా శవాల మీదుగా ఊళ్ళోకి పొండి' అంటూ అరుస్తూ ఆఫీసర్ కారు తలుపు దగ్గర అడ్డం పడింది. అనుకోని ఈ సంఘటనకు ఆయన ఒక్కక్షణం నివ్వెరబోయాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|