|
|
Articles: TP Features | స్విస్ ఖాతాల గుట్టు రట్టు - Mr. Narsing rao D
| |
యుబిఎస్ లో వస్తున్న పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఇప్పటికే సిపిఎమ్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా స్విస్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బును వెనక్కి తీసుకొచ్చేందుకు రాజకీయ నాయకులు కృషి చేయాలని బాబా రాందేవ్ కూడా డిమాండ్ చేశారు. అయితే దేశంలోని ప్రధాన పార్టీల నాయకులందరికీ స్విస్ బ్యాంక్ గుప్త నిధులతో, నేలమాళిగలతో సంబంధాలున్న విషయం జగమెరిగిన సత్యం. బోఫోర్స్ కేసులో ప్రధాన ప్రతి పక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధం జరిగింది. అయితే స్విస్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బును మొత్తంగా వెనక్కి తీసుకురావాలని ప్రజా ఉద్యమం రావాల్సి ఉంది.
భారత గణతంత్ర ప్రజాస్వామిక విలువలను నిలబెట్టుకోవలసిన బాధ్యత భారత పౌరులపై ఉంది. భారతదేశం కేవలం మార్కెట్ గాని మ్యూజియమ్ గాని కాదు. వలసవాదుల వల్ల, ప్రస్తుత థానేదార్ల వల్ల దెబ్బతిన్న ఒక సజీవ నాగరికత ఇది. ఈ నాగరికత విశిష్టతను నిలబెట్టుకోవలసిన బాధ్యత సగటు భారతీయునిపై ఉంది. రాజకీయ నాయకులు ఈ విషయంపై మౌనం వహిస్తే ఈ దేశ కులీనులే దేశాన్ని భ్రష్టు పట్టించారనుకోవలసి ఉంటుంది. పబ్ ల్లో స్వేచ్ఛ కోసం అహర్నిశలు కేంద్రీకరించే ఈ దేశ (ప్రింట్, ఎలక్ట్రానిక్) మీడియా ఈ విషయంలో ప్రతికూల పాత్ర పోషించడం సిగ్గుచేటు. మన మీడియా కేవలం వినోదానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. దేశ ప్రయోజనాలకు ఉపకరించే ఇలాంటి విషయాలను మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
గత చరిత్రలో భారతదేశాన్ని ఉన్నతవర్గాలు ధ్వంసం చేసినట్లే ప్రస్తుత చరిత్రలో కూడా దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. అంతేకాని, సామాన్య రైతాంగం, కార్మికులు మాత్రం ఈ దేశాన్ని ధ్వంసం చేయడం లేదు. ఈ దేశాన్ని దోపిడీ చేసేందుకు, ఆక్రమించేందుకు పలు రంగాల్లోని ఉన్నతవర్గాలే కారణం. రాజకీయాల్లో, మీడియాలో, వ్యాపారంలో, అధికార గణంలో, కళలు, సాహిత్య సాంస్కృతిక రంగాల్లోని ఉన్నతవర్గాల భారత ఆర్థిక సామాజిక విధ్వంసానికి ప్రధాన కారకులు. వీళ్లంతా సమష్టి తత్వంపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతున్నారు. 'రాజకీయాల్లో నేరస్తులు ఉండకూడదు' అన్న విషయం మంచిదే. అయితే విదేశీ బ్యాంకుల్లో రహస్య ఖాతాల్లేని ధనిక రాజకీయ నాయకులున్నారా? విదేశీ సంస్థల్లో దాగిన సొమ్ము అన్ని నేరాలకు గంగోత్రి లాంటిది. మన మాతృభూమి పట్ల మనకున్న దేశద్రోహ స్వభావానికి ఇది నిదర్శనం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|