|
|
Articles: TP Features | తెలుగుభాష రక్షాబంధనం - Mr. Tirumalarao Jayadheer
| |
మరి తెలుగులోనే ఎందుకిన్నాళ్ళు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నిస్తే -
మా అవ్వ ముసల్దని పక్కనబెట్టం కదా సార్. గట్లనే నోటి మీద భాష. ఉన్నన్నాళ్ళు ఉంటది. పోయేనాడు చెప్పిపోతదా సార్. ఐనా మా గుర్తింపు మా భాషే. దాన్ని కాపాడుకుంటాం అని అన్నాడు. అవును సార్ మేమిక్కడ ఎట్లా ఉన్నామో ఎవరికీ పట్టదా. మా కులపోడూ అంతే - మన సర్కారోడూ అంతేనా? అంటూ ప్రశ్నించాడు. అవును సార్, మావోళ్ళు ఇంకా అక్కడ ఈ వృత్తే చేస్తున్నారా. బతుకమ్మ పండుగ మేం మర్చినం సార్. సంక్రాంతి పండుగ, ఉగాది, బోనాల పండుగ, భలే బాగుంటది కదా. మాకు చూడాలనిపిస్తది కాని పిలిచేటోల్లు ఎవ్వరు సార్, అన్నాడు దిగులుగా.
నిజమే అతడు నాలుగు డబ్బులు అడగలేదు. తెలుగునేల మీద తన స్థలాన్ని ఆక్రమించుకోవాలనుకోవడం లేదు. తన మూలలకి అటునిటు సజీవంగా ఉన్న సంస్కృతిని తనదిగా భావిస్తున్నాడు. వీళ్ళందరినీ ఒక్కసారి (పాస్ పోర్టులు, వీసాలు అవసరం లేదు) ఈ దేశం తీసుకొస్తే ఎంత బాగుంటుంది? వారి కళ్ళలో వెలిగే కాంతి ఎంత గొప్పగా ఉంటుంది. ఐతే వారికి ఎవరు ఆతిథ్యమిస్తారు?
తెలుగు నేల మీద ఒక పదెకరాల స్థలం, దాని చుట్టూ నాలుగు చెరువులుంటే - వాళ్ళందరినీ బాగోగుల సంతకి పిలిచి - నాలుగు రోజులుంచుకుని మంచి - మంతీ మాట్లాడుకొంటుంటే ఎంత బాగుంటుంది? ఇది నెరవేరే కలేనా? ఇది రియల్టర్ల జమానా. ఇది కాసుల కాలం. పదెకరాలెవ్వరు ఇస్తారు. భూస్వామ్యంలో ఎవడో ఒకడు భూమిని దానం చేసేవాడేమో! ఆదాయం కోసం అన్నీ అమ్మకానికి పెట్టే యంత్రాంగం ఇలాంటి ఆలోచనలు చేస్తుందా? భయపడుతూనే ఒక ప్రతిపాదనని పంపిస్తే ఎలా నవ్వుతారో మనకి తెలుసు.
దక్షిణ భారతదేశమంతటా పరుచుకున్న ఇలాంటి సమూహాలు ఇంకా తమ ఆట, మాట, పాట, ఆచారాలు, సంప్రదాయాల్ని గుండెల్లో దాచుకున్నాయి. తెలుగునాట కనుపించని కళారూపాలు, సంగీత వాద్యాలింకా అక్కడ వినిపిస్తున్నాయి. వంద ఏళ్ళ తరువాతైనా ఆ కళాకారులను ఒకసారి ఈ నేలకి పిలిచి గౌరవించుకోకపోతే ఎలా? అంతరించిపోయే కళల్ని కడసారి చూసే అవకాశం దొరికితే ఎంత బాగుండు?
సంస్కృతి సామూహికం, శ్రమజీవన బృందగానాలూ, రాగాలు మన పూర్వీకుల వ్యక్తీకరణలు. ఆ మూగబోయిన అభివ్యక్తుల సాంస్కృతిక భాష అదృశ్యం కావడానికి ఇక ఎంతో సేపు పట్టదు. అందుకే ఆ భాషా పరిమళాల్ని కూడా బతికించుకోవాలి. ఏ భాష అయినా ఆ జాతి శ్రమజీవులు రూపొందించినదే. ఏ సంస్కృతి అయినా ఆ జాతి మానవ విజ్ఞానంలో విడదీయరాని భాగమే. భాషకాని భాష మన జనజీవన సాంస్కృతిక భాష. దాన్ని కూడా కాపాడుకోవడం తెలుగువారి కర్తవ్యం.
ఇప్పుడు పర రాష్ట్రాల తెలుగువారితో సంభాషించడానికి మనం సిద్ధపడాలి. అందుకు మన సాంస్కృతిక భాషని సిద్ధం చేయాలి. అదొక్కటే తెలుగు ప్రజలని విడదీయని బంధం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|