|
|
Articles: TP Features | వోటు మారితే సీటు 'చే'జారినట్టే! - Site Administrator
| |
లోక్ సత్తా ట్రయల్ రన్...
కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి సామాన్య మానవుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిని నెలకొల్పాలని, అవినీతి రహిత పాలనను అందించాలని, ప్రతి మానవుడికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు వుండే ఉత్తమ రాజకీయ వ్యవస్థను ఏర్పర్చాలన్న లక్ష్యంతో లోక్ సత్తా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సుమారు 249 అసెంబ్లీ సీట్లకు 32 లోక్ సభా స్థానాలకు పోటీ చేస్తోంది. బిసి యునైటెడ్ ఫ్రంట్ కు మరో 7 స్థానాల్లో మద్దతు ఇస్తోంది. అయితే ఎన్నికలంటే డబ్బు, మద్యం, అంగబలం అనుకునే పరిస్థితిలో అవేవీ లేకుండా ఎన్నికల బరిలోకి దిగి ఒక్క పార్టీగా అఖండ విజయం సాధించగలమన్న అపోహ, అత్యాశ కూడా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ కు లేవు. ఎన్నికల సంఘం విధించిన పరిమితులలో కూడా ఖర్చు చేయలేని అభ్యర్థులను రంగంలోకి దింపిన లోక్ సత్తా ప్రజలలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. నెమ్మదిగానైనా ప్రజలు మార్పు దిశగా అడుగులు వేస్తారని ఆ పార్టీ ఆశిస్తోంది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి స్థానంలో శాసనసభకు పోటీ చేస్తున్న జయప్రకాష్ నారాయణ్ ఆ నియోజకవర్గంలోని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉత్తమ రాజకీయ వ్యవస్థ కోసం జెపిని అసెంబ్లీకి పంపాలని కోరుతున్నారు. మేధావులు, విద్యావంతులు, ఆలోచనా పరులైన మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసిస్తున్న కూకట్ పల్లిలో జయప్రకాశ్ నారాయణ విజయం సాధించగలరని భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేస్తున్న కటారి శ్రీనివాసరావు (శేర్ లింగంపల్లి), సుభాషిణి (ఖైరతాబాద్), ప్రతిభారావు (జూబ్లీహిల్స్), డా.ఎల్ రత్తయ్య (మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం), ఏనుగు రామారావు (ఎల్.బి.నగర్), అలాగే మేకల సరోజ (చెన్నూరు), డా.కొండయ్య (అనంతపురం), భారతి (సత్యవీడు), మల్లిఖార్జున్ (పలమనేరు), ఎన్.రవీందర్ (కుత్బుల్లాపూర్), వీరేంద్రబాబు (యాకుత్ పులా), విద్యాసాగర్ రావు (జగిత్యాల), ఎం.వెంకట్ రెడ్డి (కోరుట్ల), కోదండరామారావు (వరంగల్ - వెస్ట్) తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. అయితే ఆ పార్టీ వోట్ల లెక్క జూసుకొని 'పర్సంటేజీ'తో తృప్తి పడాల్సిందే తప్ప ఈ ఎన్నికల్లో జెపి తప్ప మరెవ్వరూ నెగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|