|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
భారత, రాష్ట్ర రాజకీయాల్లో లేవు, లేవు అనుకున్న కులాలు లేచి కూచున్నాయి. ఈ ఎన్నికల్లో కులం మునుపెన్నడూ లేనంత ఎక్కువ ప్రభావం చూపించబోతున్నది. కమ్యూనిస్టు ఎర్ర తెర కప్పి ఉంచిన కులాలు తెరను తొలగించుకున్నాయి. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకత్వాలు ఒకటిన్నర కులాలతో నిండి ఉన్నాయని ఓటరు గ్రహించాడు. ఆ పార్టీల నాయకులందరు ఒక కులం వారే. కార్యకర్తలు తన్నులు, గుద్దులు తినేవారు క్రింది కులాల వారు. ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించారు.
చిరంజీవి నమ్మిన 'సామాజిక న్యాయం' సమీకరణ ప్రభావం చూపితే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. లేకపోతే ఆయన పార్టీ సోదిలో లేకుండా పోవాల్సిందే. ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అనామకులే. ఆయన 104 మంది బీసీలకు, రెండు జనరల్ స్థానాల్లో ఎస్సీలకు, మన పార్టీ పరిగి అభ్యర్థితో కలిపి ఐదు జనరల్ స్థానాల్లో లంబాడీలకు, 15 మంది ముస్లీంలకు, ఆరు స్థానాల్లో ఎంపీలుగా ముస్లీంలకు బీ ఫారాలిచ్చారు. తన కులం వారైన కాపులకు 26 సీట్లు ఇచ్చాడు.
2004లో కాంగ్రెస్ కాపులకు 25 స్థానాలు ఇచ్చింది. తెలుగుదేశం కూడా దాదాపు 25 స్థానాలను ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ కాపులకు 16 స్థానాలు, టిడిపి 7 స్థానాలను ఇచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కాపులకు మూడు 3 పార్లమెంట్ స్థానాలు, కమ్మవారికి 1 స్థానం ఇచ్చింది. కాపులు తప్పనిసరిగా గెలిచే నరసాపురం సీటును ప్రజారాజ్యం పార్టీ ఒక బీసీకి ఇవ్వడం విశేషం. ఇప్పుడు నలుగురు కమ్మవారు పార్లమెంట్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఖమ్మం లాంటి ఆరు స్థానాలను వారికి ఇచ్చింది. రెడ్లకు నరసరావుపేట, నెల్లూరు, కడప, నల్లగొండ, చేవెళ్ళ తదితర స్థానాలను ఇచ్చింది.
జనరల్ స్థానాల్లో పార్టీల వారీగా పార్లమెంట్ టిక్కెట్ల పంపిణీ
------ కాంగ్రెస్ ------ కూటమి ------ ప్రజారాజ్యం
రెడ్లు ------ 9 ------ 5 ------ 4
కమ్మ ------ 5 ------ 7 ------ 1
కాపు ------ 3 ------ 1 ------ 3
రాజులు ------ 1 ------ - ------ 1
వెలమ ------ - ------ 2 ------ 2
బ్రాహ్మణ ------ 1 ------ 1 -------- -
వైశ్య ------ - ------ 1 ------- -
బలిజ ------ 1 ------ - ------- 2
మొత్తం ------ 20 ------ 17 ------ 13
బీసీ ------ 10 ------ 12 ------ 14
మైనార్టీ ------ 1 ------ 3 ------ 6
ఎస్సీ ------ 1 ------ - ------ -
బలిజలు ఏడుగురికి ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత పి.వి.రావు భార్య ప్రమీలకు తూర్పుగోదావరి నుండి టిక్కెట్ ఇచ్చారు. మరో మాల నాయకుడు, దళిత మేధావి కత్తి పద్మారావుకు, యువనాయకుడు గౌత్ లాంటి వారికి టిక్కెట్లు ఇచ్చి వారి ఓట్లు ఎక్కువగా వేయించుకోవడానికి పి.ఆర్.పి వారు ప్లాన్ చేశారు. ఇలా కొత్తగా ఓట్ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకోవడానికి వారు వ్యూహం పన్నారు.
పార్లమెంట్ సీట్ల పంపిణీలో కాంగ్రెస్ 62 శాతం సీట్లు (20 స్థానాలు) ఓసీలకు ఇవ్వగా, దాదాపు అంతే స్థాయిలో 63 శాతం సీట్లను ప్రజారాజ్యం బీసీలకు ఇచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కాన్షియస్ గా అగ్రకులాల వారికి సీట్లను బాగా తగ్గించి బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అంతే కాన్షియస్ గా కమ్మవారికి 7 సీట్లు ఇచ్చి మొత్తం అప్పర్ క్యాస్ట్ వారికి 17 సీట్లు ఇచ్చింది. ఈ పార్టీ బీసీలకు కేవలం 28 శాతం సీట్లను మాత్రమే ఇచ్చింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|