|
|
Articles: TP Features | భాషాభివృద్ధే పురోగమనం - Site Administrator
| |
భాష మంచిదే అంటారు. కాని దాన్ని గౌరవించరు. పర భాషల (సంస్కృతం, ఆంగ్లం) పట్ల వారికి మక్కువ, గౌరవం అధికం. తెలుగుభాష అవసరమే కానీ, ఆధ్యాత్మిక కోణంలో వారికి సంస్కృతం అవసరం. జ్ఞానం, ప్రయోజనం కోసం ఆంగ్లం అవసరం. లౌకిక విలువలకన్నా ఆధ్యాత్మిక భావనకే పట్టం కట్టడం వల్ల - తెలుగుభాష పరిమితమైనదనీ, దానికి అన్ని వ్యక్తీకరణలు సాధ్యం కాదనే భావన వస్తుంది. పెళ్ళి, చావు, మంత్రం, నైవేద్యం వీటికి పనికిరాని భాష తక్కువ భాష అని అనిపించదా?! అశేష సాధారణ ప్రజలు పైన పేర్కొన్న అంశాలు తెలుగులోనే జరుపుతారు. అంటే అతి తక్కువ శాతం శిష్టులకి మాత్రమే తెలుగు పనికిరాదు. ప్రతి గిరిజన భాషలో సైతం పై కర్మకాండలు దైవపూజలు నిర్వహిస్తుండగా తెలుగుకే ఇలాంటి గతి పట్టడం ఎందుకు? ఇది సృష్టికర్త దోషమా? మానవ కల్పిత వ్యత్యాసమా? మానవుడి స్వార్థానికి భాషామతల్లి సరస్వతిని బలిచేయడమే కదా. ఆమె సృష్టించిన భాషలో ఇన్ని వైరుధ్యాలెందుకు?!
అందుకే -
భాష మానవ సృష్టి. దాన్ని మనుషుల సమష్టి సంపదగా భావించాలి. యాసలు, మాండలికాలు సహజం ఏ భాషకైనా. అందులో హెచ్చుతగ్గులుండవు. భాషని బట్టి మానవ సమాజాన్ని, మనుషులని చిన్నబుచ్చడం దురహంకారం.
భాష పట్ల సరైన దృక్పథం ఎందుకు అవసరం అంటే - సమాజంలో భావ ఐక్యత కోసం. రెండోది సామాజిక చలనాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించడం కోసం. భాష ఇక్కడ ఒక దిక్సూచిలాగా పనిచేయాలి. మానవుల మధ్య భాష ఐక్యతే కాదు ఏకత కూడా సాధిస్తుంది. సజీవ భాషలో స్వార్థాన్ని, నిరాశావాదాన్ని తొలగించే అంశాలుంటాయి. వాటిని గుర్తించి పెంచి పెద్ద చేయాలి.
కల్పిత భావాలకి లోనుకాకుండా శాస్త్రీయ ఆలోచనలు పెంచుకుంటూ, ప్రజాభాషని అభివృద్ధి పరచాలి. భాషని జీవింపచేయాలంటే సమాజాన్ని అభివృద్ధి పరచాలనే దృక్పథం కూడా అవసరమే.
భాషకి ప్రజాదృక్పథం ముఖ్యం. కాని ఒక భాష ప్రవక్తో, మేధావో, నాయకుడో ఉద్భవిస్తాడని చూడకూడదు. ఓ మేధాశక్తి వల్ల భాష బతకదు. సామాజిక జీవనంలోంచి, ఉద్యమంలోంచి తెలుగుభాష తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటుంది. ఆ భాషే కొత్త సమాజానికి, కొత్త విజ్ఞానానికి అనువుగా మారుతుంది. అప్పుడు భాష అభివృద్ధి చెందిందంటే ఆ భాషీయులు ప్రగతిమార్గాన ప్రయాణిస్తున్నట్లే!
ఆ ప్రయాణం కోసమే ఈ ఆలోచనలు!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|