|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
అప్పుడు ఏమీ తోచక చివరి ప్రయత్నంగా ఆయన దత్తుతో మాట కలిపి బాబా మిమ్ములను కలిస్తే మా కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని సంకేతాలిచ్చినందువల్ల మీ కోసమే మేం ఇంత దూరం వచ్చాం అన్నారు. వారిని ఎలాగైనా ఈ కార్యం జరిపించాలని అభ్యర్ధించారు. అప్పుడు దత్తు తనకు సమయం లేదని అంతేకాక యాగ క్రతువునకు తనను అవసరమైన సంభారాలు సమకూర్చేందుకు నియమించినందువల్ల దీక్షా కంకణం కట్టుకోలేదని అయనా బాబా సేవకుడైనందున మీ కార్యం నిర్వర్తించగలనని కాని ఈ క్షేత్రానికి సమీపంలో చేయటం వీలుకాదని తెలిపారు.
అందరినీ అక్కడి నుండి కొంతదూరంలో ఉన్న ప్రాంతపు గుర్తులు చెప్పి అక్కడ స్నానాలు చేసి కర్తలను వేచి ఉండమన్నారు. కార్యం సఫలమౌతున్నందుకు అందరూ ఎంతో ఆనందించి వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చూసి హతాశులయ్యారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పూర్తిగా రాతిబండలే కాకుండా నీరు కూడా మోకాలి లోతు కూడా లేదు. పూర్తిగా పాకుడుతో నిండిపోయి స్నానం చేసేందుకు అనువుగా లేదు. ఇక తప్పదనుకొని ఎలాగోలా కార్యం పూర్తిచేయాలి కాబట్టి కర్తలు చెంబుతో నీరు తీసుకుని స్నానం ముగించారు.
ఈ లోగా దత్తు అక్కడికి వచ్చి కార్యాచరణ ప్రారంభించి పవిత్ర కృష్ణవేణి నది పుట్టుక గురించి ఈ శ్లోకం చెప్పారు.
కృష్ణవేణి నమస్తుభ్యం సర్వపాప ప్రణాశని
త్రిలోక పావన జరే రంగత్తుంగ తరంగిణి
సర్వదేవమయీం సాక్షాత్ - బ్రహ్మ విష్ణు శివత్మికాం
ఫలదాం సర్వ తీర్ధానం కష్టేత్వం ప్రణలోస్మహం
కృష్ణానది పుట్టినది మొదలు సముద్రంలో కలిసే వరకూ నదికి ఇరు పక్కలా ఎనిమిది మైళ్ళ దూరం వరకు కృష్ణాతీరంగా పరిగణిస్తారని ఆ ప్రదేశం ముక్తిప్రదమని గర్గ కశ్యప దేవతాది మహర్షులు పేర్కొన్నారని అందువల్ల ఆ ప్రాంతంలో సరైన నీటిపారుదల లేకపోయినా పవిత్రమే అని తెలిపి చితాభస్మ కలశానికి శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరుపుతుండగా ఎక్కడో సహ్య పర్వతం పడమటి కనుమలలో పుట్టిన కృష్ణానది సముద్రంలో కలవాలన్న ఉత్సాహంతో ఉరుకులు పరుగులతో ఆ ప్రాంతాన్ని నీటితో చుట్టుముట్టింది. అందరూ చూస్తుండగానే ఆశ్చర్యకరంగా ఆ నీరు తాటిచెట్టు అంత ఎత్తుకు పెరిగి ఒడ్డున ఉన్న అందరినీ స్పృశించింది. కార్యక్రమం ఆఖరి ఘట్టంగా రామయ్య గారి చితాభస్మంతో నిండిన కలశాన్ని నీటిలో నిమజ్జనం చేయగా ఆ కలశం నదీ ప్రవాహంలో కృష్ణలో తేలియాడుతూ నదీమతల్లి గర్భంలో నిమజ్జనమైంది.
ఎంతో ఆశ్చర్యకరమైన ఈ సంఘటన గురించి దత్తు ఇలా చెప్పారు. 'స్వర్గస్తులైన రామయ్య ఎంతో ధన్యులు. బాబా అనుగ్రహం ఆశీస్సులు ఉన్నందునే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దివ్యంగా జరిగింది. ఈ రోజు గురువారం. వీరి పూర్వజన్మ సుకృతమో లేదా ఈ జన్మలోని పుణ్యఫలమో దైవం పిలిచినట్లుగా కృష్ణవేణమ్మ అనుగ్రహించి ఉరుకులు పరుగులతో వచ్చి ఆ కలశాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నది. ఇది అపూర్వ సంఘటన. అంతేకాక ఈ రోజు వీరి కార్యక్రమం మాత్రమే ఈ అనంత నాగార్జునసాగర్ ప్రాంతంలో జరిగింది. సాయిబాబా నాకు ఆజ్ఞ చేసినందువల్ల రామయ్య ఎంత పుణ్యాత్ములో అర్ధమవుతోంది. నేను కూడా బాబాకు బద్ధుడనే. నా పేరు దత్తాత్రేయ శర్మ. అందువల్లే బాబా ఈ కార్యక్రమానికి నన్ను నియమించారు. మీరు ఈ క్షేత్రానికి ఉదయం 9 గంటలకు వచ్చినప్పటికీ అపరాహ్ణంలో కావలసిన కార్యాన్ని ముందుగా నిర్వహించడం సాధ్యం కాదు కదా! చూడండి ఇప్పుదు సరిగ్గా మధ్యాహ్నం 12.00 గంటలు అయ్యింది. బాబా అనుగ్రహం ఉన్నది కాబట్టే ఈ రోజు కాదనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయినది. బాబాను నమ్మిన వారికి బాబా చెంత ఉండి ఏ కార్యక్రమమైనా సానుకూల పరుస్తాడు' అని చెప్పి అందరినీ ఆశీర్వదించి మళ్ళీ నదిలో స్నానంచేసి సుచిర్భూతుడై వారి యాగ కార్యక్రమాలకు వెళ్ళిపోయారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|