|
|
Articles: TP Features | నేతిబీరలా ఫిరాయింపు చట్టం - Site Administrator
| |
రాజకీయాలు డబ్బుమయం అయ్యాయి. సాధారణ సందర్భంలో ఒక వ్యక్తి ఎం.ఎల్.ఏ. కావడానికి 2-5 కోట్లు, ఎంపి కావడానికి 5-14 కోట్లు ఖర్చు అవుతున్నది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ ఖర్చు చాలా తక్కువగా ఉండవచ్చు మరికొన్ని సందర్భాల్లో అసాధారణంగా పెరగవచ్చు. అది వేరే విషయం. ఇంత ఖర్చుతో ఏ వ్యక్తీ ప్రజాసేవ చేయడానికి రాడు. మరి ఎందుకు వస్తున్నట్లు. పెట్టిన రెండు కోట్లకు కనీసం 20 లేదా 200 కోట్లు చేసుకోవడానికే వస్తాడు. నైతిక పద్ధతిలో, ధర్మబద్ధంగా ఇంత డబ్బు వెనక్కి రావడం జరగనే జరగదు. 'గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్లు' రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడడం జరుగుతున్నది. కాని అన్ని స్థాయిల్లో అన్ని రంగాల వారు దీని గురించి నిర్లజ్జగా మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఇన్ని చట్టాలున్నాయి, ఆదాయపు పన్ను శాఖ ఉంది. మరి 75 లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని దాటి ఎలా స్విస్ బ్యాంక్ చేరాయి. ఆ డబ్బు ఎవరిది? సంపాదించినవారు దాన్ని ఎలా సంపాదించారు, అది దేశం ఎలా దాటింది...? ఇంత గంభీరమైన విషయాన్ని ఎవరూ ఆలోచించరు. దీనికి రెండు మూడు రెట్ల నల్లడబ్బు దేశంలో ఉంది. రెండవ స్వాతంత్ర్య ఉద్యమం రావలసిన సందర్భం ఇది. ఒకవేళ నేటికీ బ్రిటిష్ వారు పాలిస్తూ ఉండినా ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదేమోనని అనిపించేలా ఈ దేశంలో పాలకవర్గాలు జనాన్ని దోపిడీ చేశారు. పేదవారిని అతి పేదవారుగా, అతి పేదలను భిక్షగాళ్ళుగా మారుస్తూ పై వారు మాత్రం కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటున్నారు.
ప్రస్తుత తరుణంలో పార్టీ ఫిరాయింపుల బిల్లు అమలు అవుతుందని, ఫిరాయింపుదార్లను ఆపుతుందని అనుకోవడం అమాయకత్వమే అవుతుందనడంలో సందేహం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|