|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
మరింక ఎంజాయ్ చెయ్యడం ఎలాగ? సుమతి తన అక్క కూతురు వసంతకి ఫోన్ చేసింది. అసలే ఉద్యోగస్తురాలు. క్షణం తీరని మనిషి. ఆమె ఫోన్ లో దొరకడమే అపురూపం. మరింక వసంతని వదల్లేదు సుమతి. `ఏంటే బొత్తిగా నల్లపూసవయిపోయావు? ఈ పిన్నొకత్తుందని మర్చిపోయావేంటి? ఎప్పుడైనా రావచ్చుకదా...' ఫోన్ లోనే నిష్ఠూరమాడింది. `లేదు పిన్నీ, ఎప్పటికప్పుడు రావాలనే ప్రయత్నం. కాని కుదరటంలేదు. బిజీ పిన్నీ, ఆదివారమొస్తే చాలు... పిల్లలేదో ప్రోగ్రామ్ పెట్టేస్తారు. వారమంతా కష్టపడతాం కదా... వీకెండయినా ఎంజాయ్ చెయ్యకపోతే ఎలాగంటారు'.
ఎంజాయ్ అన్నమాట టక్కున పట్టుకుంది సుమతి.
ఎంజాయ చెయ్యడమంటే ఏం చేస్తారే..?
ఇదివరకైతే ఎంజాయ్ మెంటంటే సినిమా ఒకటే ఉండేది. ఈ రోజుల్లో ఎంజాయ్ మెంటుకి బోల్డు మార్గాలు. ఔటింగ్స్, రిస్టార్ట్స్, టూరిస్ట్ స్పాట్స్... ఇప్పుడన్నీ బాగా డెవెలప్ చేశారు కదా...
సరిగా అర్ధం కాలేదు సుమతికి. ఇంతకీ మొన్న సండే ఎక్కడికెళ్ళారు మీరు?
సిటీ బైట గుజరాతీ, రాజస్థానీ ప్రదర్శనలు ఆ ట్రెడిషన్ తెలిపేలా ఉంటాయి పండగ రోజుల్లో. ఆ పండక్కి సంబంధించిన అలంకారాలు, దానికి సంబంధించిన డాన్సులూ, మ్యూజిక్కూ, గేమ్సూ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీకి ఇంతని తీసుకుంటారు. ఈ సిటీ పొల్యూషన్ కి దూరంగా, హాయిగా గడిపెయ్యొచ్చు. మంచి ఫుడ్ ఉంటుంది. బోల్డు మంది జనాలొస్తారు. మొన్న వీకెండ్ మేమెంత బాగా ఎంజాయ్ చేశామో తెలుసా... అవును పిన్నీ, తోచట్లేదు....మీరు రండి అని మమ్మలందర్నీ పిలిచే బదులు నువ్వూ, బాబాయ్ గారూ హాయిగా అలా వెళ్ళి ఎంజాయ్ చెయ్యొచ్చుకదా...
ఉచితసలహా పడేసింది. సుమతి సంసార అనుభవం వెంటనే ఒక ప్రశ్న అడిగింది. అంటే అక్కడ మెంబరవ్వాలా... ఎంత కట్టాలి... అంటూ మెంబరవ్వాలని రూలేం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజర్వ్ చేసుకోవచ్చు. మొన్న వీకెండ్ కి మా ఫ్యామిలీకి ఐదు వేలయింది. అయినా మీకేం లోటని? హాయిగా ఎంజాయ్ చెయ్యండి.... ఫోన్ పెట్టేసింది వసంత. ఒక్క వీకెండ్ కి అయిదువేలా... ఆలోచించింది సుమతి. నలుగురున్న ఫ్యామిలీ కనుక వాళ్ళకి అయిదు వేలైంది. తమిద్దరికీ కనీసం రెండువేలవ్వచ్చు. ఒక్క వీకెండ్ ఎంజాయ్ మెంటుకి రెండువేలు ఖర్చా... మింగుడుపడలేదు సుమతికి. అదేమాట శంకర్రావుతో చెప్పింది.
వసంత, మొగుడూ ఐటి ఉద్యోగస్తులోయ్. ఆ మాట మర్చిపోకు. వాళ్ళ జీతాలూ అలాగే ఉంటాయి... ఖర్చులూ అలాగే ఉంటాయి... మన ఆలోచనలకది సరిపడదు.
అంటే అంత డబ్బు మనం ఖర్చుపెట్టలేమా?
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|