|
|
Articles: TP Features | అలెగ్జాండరే కుమారస్వామి! - Site Administrator
| |
ఆర్.సి.మజుందార్ (ది క్లాసికల్ అక్కౌంట్స్ ఆఫ్ ఇండియా కలకత్తా - 1981) ప్రకారం తక్షశిల దాటిన తర్వాత SOPHYTIS అనే రాజ్యం ఉంది. ఇది డియోడొరస్ రికార్డు ఆధారంగా చెప్తున్న చారిత్రక అంశం కాబట్టి, ఈ పేర్లన్నీ గ్రీకు భాషలో కన్పిస్తున్నాయి. ఈ రాజ్యానికి EMBISAROS పాలకుడు. ఇతని పొరుగు రాజ్యం పురుషోత్తముడు (PORUS) పాలిస్తున్నది. ఈ ఇద్దరూ అలెగ్జాండర్ కు వ్యతిరేకంగానూ, తక్షశిల రాకుమారుడు అంబి అలెగ్జాండర్ కు అనుకూలంగానూ నిలబడ్డారు.
జీలమ్ నది ఆవలి ఒడ్డున జరిగిన ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం BUCAPHELA మరణించిందట. STRABO ప్రకారం ఇది స్వల్పకాలం జరిగిన యుద్ధం. ఇందులో అలెగ్జాండర్ గెలవనూ లేదు. పురుషోత్తముడు ఓడనూ లేదు. అది అసంపూర్తిగా ముగిసింది... అంతే!
యుద్ధంలో పురుషోత్తమ సేనలదే పై చేయి కావటానికీ అలెగ్జాండర్ వైపు జననష్టం ఎక్కువ జరగటానికి కొన్ని చెప్పుకోదగ్గ కారణాలను ఆర్.సి.మజుందార్ చక్కగా విశ్లేషించారు.
-గుర్రం పైన కూర్చుని యుద్ధం చేసే అశ్వికుడు ఒక చేత్తో గుర్రం కళ్ళాలను పట్టుకుని రెండో చేత్తో ఆయుధాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. ఆ రోజుల్లో కాళ్ళకు `రికాబు' (STIRRUP) తగిలించుకొనే పద్ధతి గ్రీకులకు తెలియదు. రికాబుని గుర్రానికి కట్టి కాళ్ళు అందులో దూర్చి కూర్చుంటే అశ్వికుడు రెండు చేతుల్నీ ఆయుధాలు ప్రయోగించడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. రికాబును అప్పటికే భారతీయులు వినియోగంలోకి తెచ్చారు. క్రీస్తు శకం 2వ శతాబ్ది తర్వాతే రికాబు వాడకం పాశ్చాత్యులకు తెల్సింది. పురుషోత్తమ సేన విజయానికి ఇదొక కారణం.
- జి.ఎన్.పంత్ ఇండియన్ ఆర్చరీ అనే గ్రంథంలో (ఆగమ కళాప్రకాశన్, ఢ్లిలీ - 1978) పురుషోత్తమ సేన రథాలను ఎక్కువగా వినియోగించిందనీ, పైకప్పు ఉండటాన అందులో నిల్చున్న రథికుడు సురక్షితంగా బాణ ప్రయోగం చెయ్యగలుగుతున్నాడనీ, బహిరంగ స్థలంలో నిలబడ్డ కాల్బలం ఎంత బాణప్రయోగం చేసినా రథికుడిదే పై చేయి అవుతుందని, అలెగ్జాండర్ ఎక్కువ మందిని నష్టపోవటానికి ఇది ఇంకొక కారణంగా చెప్తారు.
- అలెగ్జాండర్ చాలా త్వరగా పరాజయ ప్రమాదాన్ని గ్రహించాడు... పర్షియాని జయించినంత సులువుగా ఇండియాని హస్తగతం చేసుకోలేనని, వెనుతిరగడమే మేలని గుర్తించాడు. పర్షియాలో దరియస్ చక్రవర్తి పిరికితనంతో తననూ, తన రాజ్యాన్ని బలిచేసుకున్నాడు. ఇక్కడ పోరస్ అనబడే పురుషోత్తముడు ధైర్యంగా నిలబడి యుద్ధ కౌశలాన్ని ఉపయోగించాడు. అలెగ్జాండర్ సేన అప్పటికే అలసిపోయి ఉంది.
- అలెగ్జాండర్ యుద్ధరంగం నుంచి తనను తాను విరమించుకొని బాక్ట్రియాకు తిరుగుప్రయాణమై వెళ్ళిపోయాడు. యుద్ధం అసంపూర్తిగా ముగిసింది.
- మజుందార్ ప్రభృతుల ప్రకారం - అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పురుషోత్తముడు రాజుగా కొనసాగాడు. కాబట్టి అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించి పాలించాడని, గ్రీకు దేవతల్ని తెచ్చి ఇక్కడ హిందూ దేవతలుగా ప్రకటించి పూజింపచేశాడనీ... ఇవన్నీ కట్టుకథలే!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|