|
|
Articles: TP Features | భావం పరాయీకరణ - Site Administrator
| |
ఈ మాత్రం నిఘంటువుల్లో కనిపిస్తుంది. ఆ రోజు `దొంగ ఏరువాక', జ్యేష్ఠ పూర్ణిమనాడు అసలు ఏరువాక చేస్తారు అని నేదునూరి గంగాధరం పేర్కొన్నారు. (మిన్నేరు 1968) దొంగ-అసలు, పచ్చి-పండు, మడి-మయల ఇవి మానవజాతికి ప్రకృతికి, సంస్కృతికి గీసిన సరిహద్దులు. మన దేవాలయాల్లో కల్యాణానికి ముందు పెళ్ళికూతురును దొంగిలించడం `దొంగలదోపు' అభినయిస్తారు. శ్రీశైలంలో సంక్రాంతికి శివునికి `దొంగపెళ్ళి', శివరాత్రి `అసలు పెళ్ళి'. భద్రాచలంలో రామునికి చేసేది `దొంగలదోపు'. ఊళ్ల మధ్య పిల్ల తగవులు తెగక పంతాలు, పట్టింపులకు పోయే గిరిజన పెద్దలు, పడుచుల పెళ్ళిమాటలు ఎంతకూ తేలనివ్వరు. వీళ్ళతో లాభం లేదని పడుచులు తెగించి అడవిలోకి వెళ్ళి `దొంగపెళ్ళి' చేసుకుంటారు. `మధుయాత్ర' తరువాత ఊళ్లోకి వచ్చి కులానికి బంతి పెడతారు. తనను లేవదీసుకుని పొమ్మని రుక్మిణి, కృష్ణుడిని ఆహ్వానించిన గాథ మనను ఎప్పుడూ ఉత్సాహపరుస్తుంది.
ప్రకృతికి అధిదేవతలు అడవి రాజులు. వారి అనుజ్ఞ కోరుతూ రాజుల పండుగ చేసుకుని, గిరిజనులు (ఫిబ్రవరి నెలలో) అడవికి పోయి చీపురూ, గడ్డి మొదలైన ఫలసాయం తెచ్చుకుంటారు. ఈనాటి పొలం కూడా ఒకనాడు అడవే. కాబట్టి పొలం పనులు ప్రారంభించే ముందు రాజుల అనుమతి తీసుకోవాలి. పొలం పనులు కొత్త అమావాస్య నాటికి కొద్దికొద్దిగా ప్రారంభమవుతాయి. అప్పుడు ఘనంగా పండుగ చేయడం సాధ్యం కాదు. జ్యేష్ఠమాసంలో పనులు ఊపందుకుంటాయి. అందుకే `కొత్తమాస' నాడు `దొంగ ఏరువాక', వర్షాలు పడ్డ తరువాత `అసలు ఏరువాక' పండుగలను, ఆచారాలను శ్రద్ధగా పాటించే గిరిజనులను చూసే `ఈశావాస్య మిదం సర్వం... తేన త్యక్తేన భుంజీతా:' అని ఉపనిషత్తుల్లో చెప్పారు. మానవ జాతి `దొంగ' సరదాలే కాదు, ఇలా వివిధ కాలాల్లో అన్ని ఆచారాలను పోల్చిచూస్తే గాని మన చరిత్ర ఎలా మారుతుందీ అర్థం కాదు. ఉత్పత్తి రంగంలో ఆచారాలు - పని/కాలవిభజన కలిసిపోయి ఉంటాయి. ప్రయోగాలన్నిటినీ పేర్కొనడం నిఘంటు నిర్మాతల బాధ్యత.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|