|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు జలయజ్ఞం వంటి కార్యక్రమాలు ఆటంకం లేకుండా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మరి కొందరు కోరుకుంటున్నారు. 'జగన్ లో కొత్తగా డబ్బు సంపాదించాలి అనే యావ ఎక్కువదా ఉండదు. తండ్రి పేరును నిలపాలి, తండ్రిని మించిన తనయుడిని అనిపించుకోవాలని ఉంటుంది' కాబట్టి ఆయన ద్వారానే రాష్ట్రాభివృద్ధి సులువౌతుందన్నది ఇంకొందరి వాదన.
జగన్ ను మనసా, వాచా వ్యతిరేకించే వారిలో రాజశేఖరరెడ్డికి దూరంగా ఉన్నవారు లేదా ఆయన చేత దూరంగా పెట్టబడిన వారు, మంత్రివర్గంలో చోటు దక్కనివారు, నేనే ముఖ్యమంత్రిని కావాలనుకునేవారు ప్రధానంగా ఉన్నారు. ఈ పిల్లవాడు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయితే బ్రతికినన్ని రోజులు మనపై స్వారీ చేస్తాడనే ఆలోచన ఉన్నవారు, కులం రీత్యా, ప్రాంతం రీత్యా, మతం రీత్యా ఇష్టపడని వారు ఇలా ఎందరో ఉండవచ్చు. రాజకీయాల రీత్యా పిల్లవాడిని ఎదుర్కోవాలి, తండ్రితో మాటలు పడ్డాం, కొడుకుతోనూ మాటలు పడాలనే ఆలోచన ఉన్నవారు జగన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు కూడా ఈ కారణం వల్లే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడడడం ఇష్టపడకపోవచ్చు.
రాజకీయాలలో సమర్ధించేవారికి ఎన్ని కారణాలుంటాయో విమర్శించేవారికీ అన్నే కారణాలు ఉంటాయి. ఏది ఏమైనా మన ప్రజాస్వామ్యం ఒక నెంబర్ గేమ్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ పరీక్షలో దాదాపు గెలిచినట్టే. ఆయన అభ్యర్థిత్వాన్ని వద్దనుకునేవారు స్వల్ప సంఖ్యాకులు అయిపోయారు. సంఖ్యాబలానికే అధిష్టానం ఆమోదం తెలిపితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లే. కాని అధిష్టానం ఈక్వేషన్లు అంత సులభంగా ఉండవు. ఏఐసిసి లో తలపండినవారు ఎందరో ఉంటారు. వారు అనేక కోణాల్లో విషయాన్ని అధ్యయనం చేసి పరిష్కారాన్ని సూచిస్తారు. ఉదాహరణకు మిగిలిన నాలుగేళ్ళలో వచ్చే విమర్శలు, ఎదురయ్యే సమస్యలు, తెలంగాణ సమస్య, నిధుల సమస్య, 2014 ఎన్నికలు, ఎఐసిసికి ఢిల్లీకి అధికారికంగా, అనధికారంగా ముడుపుల బరువు, ప్రభావం, బ్రాహ్మణీయ భావజాల పరిరక్షణ, క్రైస్తవ మత వ్యాప్తి, అధికారపీఠంపై కూర్చున్నవారు ఏకు మేకుగా మారరు అన్న గ్యారంటి ఇత్యాది ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|