|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నామంటే...
గత దశాబ్ద కాలం నుండి జాతి, భాష భావనలు తెలుగుసీమలో పెరిగాయి. సమాజంలో తెలుగు భాషోద్యమ చైతన్యం అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఒక మంచి మలుపు. ఈ మలుపుని విజ్ఞతతో సరికొత్త మలుపుగా మార్చుకోవాలి. లేదా మళ్ళీ మానసిక, హృదయ ఐక్య భావనలకి విఘాతం ఏర్పడుతుంది. ప్రజాస్వామిక ఆకాంక్షల వల్ల ప్రాంతాలు విడివడినా ఈ ఐక్యత దెబ్బతినకూడదు. రాజకీయ అనాలోచిత చర్యల వల్ల తెలుగు సోదరులను సరిహద్దుల పేర లోగడ పోగొట్టుకున్నాం. భారతదేశంలో పెద్ద భాషా సమూహంగా ఉన్న తెలుగుజాతి అనైక్యతకి, విడగొట్టబడడానికి వీలు కల్పించాం.
నిజానికి తమిళనాడులో అర్ధ శతాబ్దం క్రింతం నుండి జరిగిన ఒక పరిణామాన్ని తెలుగు ప్రజలు, మేధావులు గుర్తించి ఉంటే బాగుండేది.
తమిళనాట శిష్ట బ్రాహ్మణవర్గం మొదట కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. అక్కడా ఆధిపత్యం నెరిపారు. కాని వర్గపోరాటంలో ఇమడలేక ఆ తరువాత స్వతంత్ర పార్టీలో చేరారు. వారు 1930-45 వరకు భారతదేశ స్వాతంత్ర్యం కోసం నిలబడ్డారు. జాతీయ భాష హిందీ కోసం కూడా మద్దతునిచ్చారు. ఈ విషయాల్ని డాక్టర్ రామమనోహర్ లోహియా తెలిపారు. అతి తక్కువ సంఖ్య గల వీరు వ్యక్తివాదం, ఆధిపత్య ధోరణులను ప్రదర్శించి అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకి దూరమయ్యారు.
అంతకు ముందు నుండే తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాలు బలపడసాగాయి. ఆనాడు 'కాంగ్రెస్ నాయకత్వం కూడా బ్రాహ్మణేతరుల చేతుల్లోకి పోయింది. ఈ కాంగ్రెసేతర పార్టీలన్నీ బ్రాహ్మణ విరోధ, ఉత్తర భారత విరోధ, హిందూ విరోధ పార్టీలు కావడం విశేషం... అయితే బ్రాహ్మణేతరులు పైకి రావడాన్ని బ్రాహ్మణులు సహించి ఉండవలసింది. వారు అలా చేయకపోయినందుకు విచారం...' అని లోహియా ఆ పుస్తకంలో అన్నారు.
ఆ రకంగా తమిళనాడులో బ్రాహ్మణేతరుల భాషకి ఆ ఉద్యమాల వల్ల తగిన స్థానం లభించింది. వారిలో నుండి కవులు, రచయితలు, మేధావులు వచ్చారు. అందుకే ఈ కొత్త తమిళం సర్వజనామోదం పొందింది. భాషపై ఎవరి పట్టూ లేదు. అది స్వేచ్ఛగా వికసించింది. ఆ భాషని అందరూ ప్రేమించారు. ఆ భాషలో తమ అస్తిత్వాన్ని ప్రకటించారు. దానితో మమేకం పొందారు. తమిళ భాషా వ్యవస్థలో అత్యధిక ప్రజలు భాగమయ్యారు. అందువల్ల ఆ భాషాభిమానం అందరికీ అలవడింది. భాషాభిమానులైన తమిళులు జాతి అభిమానాన్ని కూడా తమదిగా చేసుకున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|