TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
పత్రికల పుట్టుక-పరిణామం
- Site Administrator
< < Previous   Page: 5 of 5    
20వ శతాబ్దంలో 'కల్పలత', 'శారద', విశ్వనాధవారి 'జయంతి', కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఆంధ్రపత్రికలో చేరిన 'భారతి' పత్రిక మరియు సత్యాగ్రాహి, దరిద్రనారాయణ వంటి సారస్వత పత్రికలు తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కాశీపట్నం కొండయ్య గారి నాయకత్వంలో 'వీరభారతి', కృష్ణాజిల్లాలో 'జయభారత్', 'రెఢీ' అనే రహస్య పత్రికలు మద్దుకూరి చంద్రశేఖరరావు నాయకత్వంలో నడిచాయి. విప్లవధోరణిలో నెహ్రూ ఆధ్వర్యంలో 'నేషనల్ హెరాల్డ్' కమ్యూనిస్టు పార్టీ వారి 'నేషనల్ ఫ్రంట్', 'నవశక్తి', రామనాధ గోయంక నాయకత్వంలో ఆంధ్రప్రభ 1938, గద్దె లింగయ్య సంపాదకత్వంలో 'ప్రభ' మాసపత్రిక 1935లో ప్రారంభమైనాయి. ఎన్ జి ఆచార్యగారి 'ప్రజాబంధు', తాపీ ధర్మారావు గారి 'కాగడా', పిఠాపురం మహారాజా పీపుల్స్ పార్టీ తరఫున 'జనవాణి' అనే పత్రికలు నడిపారు. సాధన, వాహిని, ప్రజామిత్ర, ప్రతిభ వంటి పత్రికలు కూడా ఈ కాలం నాటివే. స్త్రీల కొరకు గృహలక్ష్మి కె.ఎన్.కేసరి ఆధ్వర్యంలో నడపగా, తెలుగు సాహితీరంగ అభివృద్ధికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు 'ప్రబుద్ధాంధ్ర' పత్రికను నడిపారు. ఉదయని, జ్వాల, సాహితి వంటివి సాహిత్య రంగంలోను 'విజ్ఞానం' అనే పత్రిక విజ్ఞాన విషయాల ప్రచురణలోనూ పేరు పొందాయి. న్యాయపతి రాఘవరావుగారు 'బాల' అనే పత్రికను, బిఎన్.కె.సంస్థవారు 'చందమామ' అనే బాలల పత్రికలను ఈ కాలంలో ప్రారంభించారు. స్వాతంత్ర్యాంతరం 1959లో ఆంధ్రప్రభ, 1960వ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలు విజయవాడ నుండి తమ ముద్రణను ప్రారంభించాయి. 1967లో ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికను ప్రారంభించింది. ఆంధ్రపత్రిక 1974లో మద్రాసు నుండి హైదరాబాద్ కు మారింది. 1974 నుండి ఈనాడు, 1984 నుండి ఉదయం పత్రికలు తమ ప్రచురణలను ప్రారంభించాయి. వీటితోపాటు మునిసఫ్, రెహినుమా-ఇ-దక్కన్, సియాసత్ అనే ఉర్దూ పత్రికలు కూడా మన రాష్ట్రంలో వెలువడుతున్నాయి. గడిచిన దశాబ్ది కాలంలో పై పత్రికలతో పాటు వార్త, సూర్య, సాక్షి వంటి అనేక దినపత్రికలు, మయూరి, చైత్యభూమి, జ్యోతి చిత్ర, సితార, శివరంజని, స్వాతి వంటి వారపత్రికలు, నడుస్తున్న చరిత్ర, చరిత్ర సన్నిధి, యోజన వంటి విజ్ఞాన దాయక మాసపత్రికలు, అన్నదాత, చతుర, విపుల, ఉద్యోగ విజయాలు, విజేత కాంపిటేషన్, ఉద్యోగ సోపానం, వివేక్, డిస్కవరి, తేజ వంటి వార, పక్ష మాసపత్రికలు తమ ప్రచురణలు ప్రారంభించి ఆంధ్రదేశంలో ప్రాచుర్యం పొందాయి. అనేక సాయంకాల పత్రికలు కూడా పెద్ద పట్టణాలలో ప్రచురితమవుతున్నాయి.

Be first to comment on this Article!

< < Previous   Page: 5 of 5    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.