|
|
Articles: TP Features | సుప్రీంకోర్టు గొప్ప తీర్పు - Site Administrator
| |
అమాయకులైన, నిస్సహాయులైన దళిత బహుజనుల పిల్లలు పట్ల ఇంతకంటే అమానుషమైన, క్రూరమైన చర్య మరొకటి ఉండదు. ఫలితాలను చూపించాలనే తాపత్రయంతో విద్యార్థులను ఒక తరగతి నుంచి మరొక తరగతికి ఉత్తీర్ణులను చేస్తున్నారు. దానితోడు పరీక్షపే ఉండరాదనే కపిల్ సిబాల్ గారి ప్రతిపాదన ఉండనే ఉంది. చివరకు పాఠశాల నుండి ఎంతమంది ఉత్తీర్ణులౌతారో, ఎంతమంది పరీక్ష తప్పి ఆత్మహత్యల పాలౌతారో భగవంతునికే తెలవాలి. ఆలోచిస్తే ఇది చాలా భయంకరమైన ప్రతిపాదన.
ఈ ప్రతిపాదన వెనుక పాలకవర్గం, అగ్రకులాలవారి పిల్లలు, మూడవ ఏట నుండి ఆంగ్లం నేర్చుకొని బాగుపడుతున్నారన్న ఆక్రోశం ఉంది. ఇది పాక్షిక సత్యం మాత్రమే. పాలకవర్గాల వారికి, పాలకవర్గాలకు చెందిన అగ్రకులాల వారికి ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్య కేవలం అలంకారప్రాయమే. జీవితంలో రాణించడానికి ఆ విద్యే ఆధారం కాదు. నైతిక విలువలు ఎవరికీ పట్టని నేటి సమాజంలో వారి బిడ్డలు, కాలక్షేపం కొరకు, సంఘంలో ఒక స్థాయి కొరకు, పేరు పక్కన తగిలించుకొనే డిగ్రీల కొరకు చదువుతున్నారే తప్ప మరే ప్రయోజనాన్ని ఆశించికాదు. పోతే అగ్రకులా వారు కొందరు, మధ్యతరగతి వారు మరికొందరు, కొంత ఉపలబ్ధి పొంది ఉండవచ్చు. దీని వెనుక తల్లితండ్రుల కఠోర శ్రమ, అసమానమైన ఆర్థికత్యాగం ఉన్నాయి. అయినప్పటికీ మూడవ ఏట నుండీ ఆంగ్ర బోధనతో వారి పిల్లలు ఎంతో విలువైన, తిరిగిరాని బాల్యాన్ని కోల్పోతున్నారు. ఇది నిర్ద్వందంగా క్రూరమైన చర్యే. దీన్ని రూపుమాపటానికి సమష్టిగా ఉద్యమించాలి గానీ, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా అన్ని గ్రామాలలోనూ, ప్రభుత్వ బాధ్యతతో ప్రీస్కూళ్ళు పెట్టాలని డిమాండ్ చేయడం విడ్డూరం. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా సాధకబాధకాలను విచారించకుండా, ప్రభుత్వ ఆర్థిక స్తోమతను గమనించకుండా, వాస్తవాలను పరిశీలించకుండా చేసిన ఈ ప్రతిపాధనలు ఆచరణీయం కావు.
దేశం మొత్తం మీద ఒకే రకమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం. వారుచేసిన సూచనలు Regimentation ఉండే Totalitarian దేశాల్లోనే సాధ్యం.
ఏ ఇతర మానవీయ విలువలు లేకుండా కేవలం ఆర్థిక లబ్ధి, జీవనోపాధులే చరమలక్ష్యంగా, మన విద్యావిధానాన్ని రూపొందించాలనుకుంటే, పుట్టగానే పొత్తిళ్ళలోని మన పాపలను తల్లుల నుండి వేరుచేసి ఆంగ్లభాష మాత్రమే మాట్లాడగలిగిన వారి సంరక్షణలో నడిచే శిశు రక్షణ కేంద్రాలలో చేర్పిస్తే బాగుంటుంది. తెలుగు బాలలను మాతృభాషా ప్రమేయం లేని ఆంగ్ల శిశువులుగా క్లోనింగ్ చేయవచ్చు. తల్లితండ్రులు వారి ఆర్థిక భవిష్యత్తును గూర్చి నిశ్చితంగా ఉండవచ్చు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|