|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
బంగ్లాదేశ్ నుంచి దేశం లోపలికి రకరకాలుగా వచ్చిన ముస్లి మతస్థులైన బంగ్లా దేశీయులు యుఐడి కార్డు పొందితే వారికి భారత పౌరసత్వం ఇచ్చినట్లే. ఇలాంటి వారిని కార్డులు పొందకుండా ఆపడం వీలవుతుందా? పైగా వీరు దేశంలోకి వచ్చి మైనారిటీల పేరుతో ప్రత్యేక హోదా, మర్యాదలు పొందుతున్నారు. ఓట్ల కోసం స్థానిక నాయకులు నిలబడి పోట్లాడి బంగ్లాదేశీయులకు ఈ నంబర్లు ఇప్పించే అవకాశం లేకపోలేదు. అన్ని రాజకీయ పార్టీల వారు పోటీలు పడి ఈ నంబర్లు ఇప్పించేందుకు ముందుకు రావచ్చు. అయితే బిజెపి వారు ముస్లిల విషయంలో తప్పకుండా అడ్డుపడేందుకు సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వారు ఎల్లరికి నంబర్లు ఇప్పించడంలో ముందుంటారు.
బంగ్లాదేశీయులే కాకుండా, నేపాలీలు, టిబెట్ శరణార్థులు, శ్రీలంక నుండి వచ్చిన వారు, పాకిస్తాన్ నుండి వచ్చిన వారు ఈ నంబర్లు పొంది ఇక్కడ తిష్టవేస్తే అవకాశం ఉంది. తిష్ట వేస్తే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ వీరు విద్రోహ కార్యక్రమాలకు దిగితే దేశానికి అపార నష్టం. ఇలాంటి వారిని చెక్ చేసే మెకానిజమ్ రూపొందించకపోతే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు వస్తాయి.
పోస్టల్ శాఖ వారు దేశాన్ని మొత్తం తొమ్మిది విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంలోని ప్రతి ఊరికి పోస్టల్ ఇండెక్స్ నంబర్ (పిన్) ఇచ్చి ఉన్నారు. ఆరు అంకెల పిన్ నంబర్ తో రాష్ట్రం, జిల్లా, ఊరును గుర్తించవచ్చు. టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారు కూడా ఈ నంబరింగ్ విధానాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఊరికి, ఇంటికి ప్రత్యేక నంబర్ ఇవ్వడంలో వీరు సఫలురయ్యారు. అలాగే సెల్ ఫోన్ కంపెనీలు పది అంకెల నంబరింగ్ ను అనుసరిస్తున్నాయి. అలాగే రవాణ శాఖ (ఆర్ టిఏ) వారు వాహనాలకు కూడా వారిదైన నంబరింగ్ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పలు శాఖల వారి సమన్వయంతో అందరికీ పనికి వచ్చేలా ఒక సార్వత్రిక విధానాన్ని రూపొందిస్తే బాగుండేది.
దేశంలో ఇప్పటికి 80 శాతం మందికి ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఐడింటిటీ కార్డులను ఇచ్చినట్లు చెబుతున్నది. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇస్తున్నాయి. రానున్న ఐదు ఏళ్ళలో 60 కోట్ల మంది పౌరులకు యుఐడి నంబర్లను ఇవ్వగలమని అథారిటీ వారు చెప్తున్నారు. ఇప్పుడు దేశంలో 102 కోట్ల జనాభా ఉంది. అంటే దాదాపు 60 శాతం జనాభాను ఐదేళ్ళలో కవర్ చేస్తారు. ఈ అరవై శాతం మందిలో చెప్పుకోదగిన ఆదాయం ఉండి పన్ను చెల్లించగలిగిన వారు, కొనుగోలు శక్తి ఉన్నవారు, ఉద్యోగులు, లాయర్లు, జర్నలిస్టులు, తదితర వృత్తుల వారుంటారు. ఆ నలభై శాతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, గిరిజనులు, సంచార జాతుల వారు, అడ్రస్ లేని, అడ్రస్ కోల్పోయిన నిర్భాగ్యులుంటారు. ఈ నలభై శాతం ప్రభుత్వం జనానికి వీలయినంత మేరకు నంబర్లు ఇవ్వకుండానే పనిని కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి నంబర్ ఇవ్వడం అంటే వారి బరువును కొంత నెత్తికెత్తుకోవడమే అవుతుంది. కాబట్టి వారి పట్ల అప్రకటిత ఉదాసీనతను కనబరుస్తారు. సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|