|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
'ఉద్వేగాలను బట్టి భాషాశబ్దాలు సాధారణంగా, అసాధారణంగా పలుకుతాయి. వీటిని లిపి కట్టించడంలోని సామాన్యీకరణ పద్ధతొకటి అనుసరించడం తప్పులేదు. 'వలవదు, వలదు, వల్దు' అనేవన్నీ సాధువులై, 'వద్దు, ఒద్దు' అనేవి అసాధువులయాయా అని గిడుగువారు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు. పదస్వరూపాలు గ్రాంథికంలో కూడా ఒక రకంగా అఘోరించలేదు' కొ.కు.
ప్రజలు - తలదించి, తలెత్తి తాడించి, తొడగొట్టి జబ్బచరచి, గెంతి ఆడి సాముచేసి, నృత్యంచేసి భాషనెంత అభివృద్ధి చేసారు! వేలెత్తి చూపించారు, హెచ్చరించారు పిడికిలెత్తి!
పోనీ విద్యార్థులు - ఒక వేలిని చూపి ఉచ్చపోయడానికి వెళ్ళి 'ఒంటేలు' పదాన్ని, రెండు వేళ్ళు చూపించి మలవిసర్జనకు పోయి 'రెంటికి' పదాన్ని - మర్యాదకరంగా (ఉచ్చకు, దొడ్డికి అనకుండా) మూత్ర, మలవిసర్జన పదాల అవసరంలేని, భాషాపదాల్ని ఎలా అందించారు?!
అదనూ పదునూ తెలిసి తేలికపాటి 'దుక్కీ'లోతుల్లోని 'దుమ్మూ' తెలిసినవాళ్ళు, కొండలను తవ్వి, బండలను పేల్చి శ్రమచేసే ప్రజలు - రాయడం, చదవడం నేర్వలేకపోయారెందుకు? ఈ రెండు నైపుణ్యాలూ సన్నిహితం కాకుండా, 'చదువు'ను ప్రజలపరం కాకుండా చేస్తుందెవరు? ఏఏ అంశాలు పిల్లల్నీ, ఏఏ అంశాలు వయోజనులనూ (ఎట్లాంటి విద్యావిధానాలు?) చదువు పట్ల వారిని విముఖుల్ని చేస్తున్నాయి. వారి జీవితాలకు సన్నిహితం కాని చదువులు వారు చదవరు. ఆ గ్రాంథికంలోనున్న సనాతన వర్గబుద్ధులనూ, నీతులను బోధించడానికి సిద్ధంగా ఉన్న రచనలను చదవడానికి ఇష్టపడరు.
వివిధ భాషాజాతుల ఉపఖండం భారతదేశం. భారత ప్రజలను తమ ఆధిపత్య వర్గాల చేతులలోనికి తెచ్చుకోవడం కోసం సాంస్కృతిక ఆయుధమొక్కటే శక్తివంతమైనదని గ్రహించడం కోసం వారికెంత కాలం పట్టలేదు. ప్రజల భాషతో ఈ పరాయీలు తాము నిర్దేశించుకున్న కర్తవ్యాలను నిర్వహించలేరు. ప్రజలలో విస్తరించి యున్న ప్రాకృత పాళీభాషలలోని జీవశక్తిని సహించలేకపోయారు సరిగదా, దాని శక్తిలో ధిక్కార స్వభావాన్నీ, స్వరాన్నీ అంగీకరించలేకపోయారు. భారత ప్రజల పరాయి ఆర్యభాషలను సమన్వయ పరచయత్నించి, సంస్కరించి, దేవనాగరి భాష పేరిట సంస్కృతాన్ని ప్రవేశపెట్టి, ఈ రహస్యభాషలో అసలు రహస్యమైన 'ఆధిపత్యశక్తి'ని దైవాంశమని ప్రకటించారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|