|
|
Articles: My Thoughts | కలకంటి కన్నీరొలికిన.. - Site Administrator
| |
'ఇక పదిరోజులకోసారి నా ఆడ పడుచు పుట్టింటికొచ్చి నా మీద అధికారం చెలాయిస్తుంది. నా చీరెల్లో మంచివాటి నన్నిటినీ ఎంచి పట్టుకు పోతుంది. అందుకేరా నేను మాటి మాటికీ అమ్మనీ - నాన్ననీ చీరెలు కొనమని వేధించేది. మరో ముఖ్య విషయంరా అన్నయ్యా! చెప్పకూడనిదే అయినా నీ పరిస్థితి చూసి చెప్పక తప్పడం లేదు. తల్లి తండ్రుల ఆజ్ఞలు శిరసా వహించడంలో తప్పించి, మీరందరూ... మీరందరూ అనుకుంటున్నట్టుగా మీ బావ గారేం శ్రీరామచంద్రుడు కాడు. దొరకాలేగాని ఎటువంటి ఆడ దానితోనైనా సంబంధం పెట్టుకోవడానికి సిద్ధమే. ఒక రోజున పనిమనిషితో ఆయన సాగిస్తున్న సరసాలు చూచినందుగ్గాను నాకు దెబ్బలు పడ్డాయి. ఇంట్లో ఏ ఒక్కరూ ఆయన్ని కేక లెయ్య లేదు సరికదా నన్నే తిట్టారు. 'ఆయనకేం ఆయన మగ మహారాజు' అని ఆయనకు వత్తాసు పలికారు. ఇలాటివి చూసీ చూడనట్లు పోవాలని అత్తగారు నాకు హితోపదేశం చేశారు. మగాడు తాగినా, వ్యభిచరించినా తప్పులేదట!? మా మామ గారన్నారు. ఈ నరక కూపంలో నేనెలా బతుకు వెళ్ల మారుస్తున్నానో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోరా అన్నయ్యా! ఒరే అన్నయ్యా! ఈ విషయాలేమీ అమ్మకీ నాన్నకీ చెప్పకురా! అనవసరంగా వాళ్లని క్షోభ పెట్టడం ఇష్టం లేక ఎలాగో జీవితంతో రాజీ పడి సర్దుకు పోతున్నాన్రా. నువ్వేదో ఆడది సుఖ పడిపోతోందనుకుంటున్నావు కాబట్టి నీకీ విషయాలు చెప్పాను. లేకుంటే నీకూ చెప్పేదాన్ని కాదు. నా బాధలూ - నా మనసులోని ఈక్షోభా ఒకే ఒక్క సారి నేను శ్వాస విడిచాక ఆ కట్టెల్లో కాలి పోవాలి. అలాగే మధ్య తరగతి కుటుంబంలోని ప్రతి ఒక్క సగటు ఆడదీ కోరుకుంటుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|