|
|
|
|
Articles: TP Features | 'టి' ఎందుకు ఇస్తుందంటే.. - Site Administrator
| |
ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందనీ పదే పదే ప్రకటనలు చేసిన మావోయిస్టులు ఎందుకని ఉద్యమించలేదు. వారిని ఎవరూ ఆపరు? ఉద్యమం ఎగిసినప్పుడల్లా వీరు అందులోకి చొరబడి భాగస్వాములు అవుతాం అని ఆశించడం జరుగుతున్నది. 'అది మెజారిటీ ప్రజల కాంక్ష. అది ప్రజా ఉద్యమం' అందుకే మేం అక్కడ ఉంటాం అని అంటున్నారు. ఇది వారి గడసరితనం. సంసిద్ధత లేని తనం అవుతుంది కాని వారు ఉద్యమాలకు మద్దతు తెలపడం కానేకేదు. నిజానికి తెలంగాణ ఒక్కటే సమస్య కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి వాటి పట్ల కూడా వారు ఇలాంటి ధోరణినే ప్రదర్శిస్తున్నారు. వారు ఉద్యమించరు. ఎవరినీ ఉద్యమించనీయరు, ఎవరైనా తెగబడి ఉద్యమాలు చేస్తే వీరు అందులో చొరబడి నాకత్వ స్థానాన్ని, ప్రచారాన్ని కొట్టేస్తారు.
'జనులు సదా అజ్ఞానంలో ఉండాలి. కనీస వసతులు, చదువులు, సౌకర్యాలతో తృప్తి పడుతూ ఉండాలి. కిమ్మనకుండా పన్నులు కట్టాలి. ప్రభుత్వ నిర్ణయాలు విధానాలను ప్రశ్నించవద్దు. స్థానిక పాలక వర్గాలు అధికారంలో ఎక్కువ వాటా అడగవద్దు'. ఇలాంటి ఉద్దేశ్యాలు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి కూడా ఉంటాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వభావం. రాజ్యాలు, ప్రభుత్వాల దీనికి వీలుగా ఉండే విధాన నిర్ణయాలే చేస్తాయి. ఇందుకు వీలు కలిగించుకునేందుకు రాష్ట్రాలు కొన్నిసార్లు చిన్నవి, పెద్దవి అవుతాయి. కొత్త జిల్లాలు ఏర్పడతాయి. నియోజకవర్గాల రూపు రేఖలు మారుతాయి. ఓటర్ లిస్ట్ లో పేర్లు చేరతాయి - గల్లంతవుతాయి. యుఐడి నంబర్లు ఇవ్వబడతాయి. పదవులు నామినేటెడ్ పోస్ట్ లు ఇవ్వబడతాయి. అంతేకాని ప్రజల సౌకర్యం కోసం, డిమాండ్ కోసం ఏ నిర్ణయాలు తీసుకోబడవు. ఇది మేలి ముసుగుల ప్రజాస్వామ్యపు స్వభావం.
ఇప్పటి వరకు ఢిల్లీ పరిణామాలను జాగ్రత్తగా పరికించి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడే ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజల ఆకాంక్ష మేరకు కాదు వారి అవసరార్ధమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారన్నది నిజం. కొత్త రాష్ట్రంలో పాత దుర్మార్గాలు కొనసాగకుండా చూడడం అనే బాధ్యత మాత్రం ప్రజల మీదనే ఉంటుంది.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|