|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
ఏ:- మిగతాది కూడా సదివినాక పేమించు. అప్పుడే ఏటైనాదేటి?
శే: (పుస్తకం తెరిచి) ఈ అమ్మాయికి ఆటలంటే చాలా ఇష్టం. టీ.వీ.ముందు కూచుని ఆటల పోటీలు చూస్తుంది. ఇంకా ఆటలపోటీల క్యాసెట్ లు తెచ్చుకుని వీడియో చూస్తుంది. పిట-పిట లాడుతూ మంచి బలిష్టంగా వుంటుంది. ఇరవైనాలుగు గుడ్లూ-ఓ లీటరు పాలూ, రెండు కోళ్లూ తింటే ఈమెకు ఓ మాదిరిగా కడుపు నిండినట్టుంటుంది. ఈమె కాలేజీ ఛాంపియన్. వెయిట్ లిఫ్టింగ్ లో రెండువందల కేజీలు అవలీలగా ఎత్తింది. జూడో కరాటే విద్యల్లో బ్లాక్ బెల్టు హోల్డర్! అమ్మ బాబోయ్!(భయంగా పుస్తకం విసిరేస్తాడు.)
సుం:- ( పుస్తకం క్యాచ్ పట్టి తెరిచి) లాంగ్ జంప్-హై జంప్, జావలిన్-డిస్కస్ త్రో, షాట్ పుట్, హండ్రెడ్ మీటర్స్ రేస్-బాక్సింగ్ అన్నిట్లోనూ ఫస్టు రాంక్! ఈమె కిష్టులైన క్రీడా కారులు క్రికెట్ లో కుంబ్లే! చదరంగంలో ఆనంద్, మైక్ టైసన్ ఇంకా .. ఇంకా ...
శే:- ఇంకా అమ్మాయి గురించి చదవకురా! మరో అమ్మాయి గురించి చదువు. (భయంతో వణుకుతుంటాడు)
ఏ:- గురూ! అవతారం గాడొనికిపోతన్నాడు. ఇంకా అమ్మాయి గురించి చదవమాకు.
సుం:- ఇదిగో ఈ అమ్మాయి ఆఖరమ్మాయి. దీంతో నీ అయిదురూపాయలూ చెల్లు. నచ్చకపోతే అది నీఖర్మ!
ఏ:- బయపడకురా డింబక! ఈ అమ్మాయి తప్పకుండా నీకు నచ్చుద్ది.
సుం:- పదమూడో ఇంట్లో పెళ్లి కాని వన్నెలాడి -విమల. ఎక్కువగా పుస్తకాలు చదువుతుంది. రాత్రుళ్లు ఎంతసేపైనా మెలుకువగానే వుంటుంది. ఈ అమ్మాయికి కవిత్వం, నాటకాలూ తదితర లలితకళలంటే ప్రాణం! 'అ-ల-వా-ట్లు-' రాత్రుళ్లు త్రీ రోజెస్ టీ తాగి మెలుకువగా వుండుట.
ఏ:- క్రేన్ వక్క పొడి నవులుద్ది. ప్రియా పచ్చళ్లు నాలిక్కి రాసుకుంటూ చదువుతుంది.
సుం:- కాల్గేట్ డెంటల్ క్రీంతో పళ్లు తోముకోవటానికే కాకుండా, తింటానిక్కూడా వాడుతుంది.
ఏ:- నెలకు పది టూబు లయిపోతయ్యి. మనోడుగాని పెల్లాడితే ఈడి జీతమంతా పల్లు అరగదీసుకోటానికే సరిపోద్ది.
సుం:- గంటకో డ్రస్ మారుస్తుంది. యూడీ కోలన్ నీళ్లలో స్నానం చేస్తుంది. వంటికి ఫారిన్ సెంట్ స్ప్రే చేసుకుంటుంది.
శే:- ఒరేయ్! ఈ అమ్మాయి బానే వుందిరా! ఈ అమ్మాయినే ప్రేమించేస్తానురా! ఇంక చదవకురా!
సుం:- నీకు తెలీదు. ప్రేమించే అమ్మాయి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. లేకుంటే ఆ అమ్మాయి అభిమానాన్ని పొందలేవు.
ఏ:- మరి పేమంటే - అల్లాటప్పా అనుకున్నావేటి? ఏదో మా గురుడు 'సుందరం రెడీ రెకనర్'-'లవ్ మేడ్ ఈజీ' రాశాడు కాబట్టి సరిపోనాది గాని,లేకుంటేనా? సదూ గురూ!
సుం:- నాటక రచయితల్లో భమిడిపాటి-ఎర్రంశెట్టి, నవలా రచయితల్లో యండమూరీ- ముళ్లపూడీ, నటుల్లో మిశ్రో- సంజీవీ; నటీ మణుల్లో ఎవరన్నా ఇష్టం లేదు. ఎందుకంటే, తనే ఓ పెద్ద నటీమణి అయి ప్రముఖ నటుల సరసన నటించాలనుకుంటోంది.
ఏ:- అదిగురూ! మనోడు పెల్లి సేసుకుంటే నాటకాలాడే అమ్మాయినే పెల్లి సేసుకోవాలి. అప్పుడు సూసుకో నా సావిరంగా! అవతారం గాడింట్లో రోజూ నాటకమే! మనం ఇంచక్కా చూడొచ్చు.
శే:- ఒరేయ్! ఇంక నన్నేడిపించకండిరా! నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకపోతే చెప్పెయ్యండిరా!
సుం:- ఒరెయ్ అవతారం! ఎందుకురా అలా అన్యాయంగా మాటాడతావు? ఈ సుందరం లవ్ మేడ్ ఈజీ ఫాలో అయిన వాడెవడికీ కష్టాలు రావురా!
ఏ:- వూఁ! ఒకటే! పేమ సోపానాలు ఎక్కడమే గాని దిగడమంటూ వుండదు.
సుం:- అయితే, ఒక దుర్వార్త! ఈ అమ్మాయి వెనక కాలేజీలో చదివే సుబ్బారావు రోజూ తిరుగుతునాడు. ఈ అమ్మాయికి లైబ్రెరీ నించి పుస్తకాలు మోసుకెల్లిస్తుంటాడు.
(కిటికీ ఫోను దగ్గరకి బ.వ్య ఎప్పుడొచ్చాడో తెలీదు గాని ..)
బవ్య:- ఆఁ! ఎంగేజ్డ్! హా హతవిధీ! నీ దృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్?!
(బవ్య ఫోను క్రెడిల్ చేసి పక్కకు తప్పుకుంటాడు)
ఏ:- అడుగో! నీ తెగులు పెండు బెదరూ! నువ్వింకేటి పేమిత్తావు గానీ ఎల్లిరా!
శే:- అయిదు రూపాయలూ కొట్టేసి నన్ను ముంచేశార్రోయ్! ఇప్పుడు నేనేంటి చేసేది రోయ్? దేవుడోయ్! హా! ప్రేయసీ!అసీ! ఎక్కెడుంటివి? నీ కరుణా కటాక్ష వీక్షణంబులు నా పై ఎప్పుడు ప్రసరించేను? నీవెప్పటికి నాకు లభించేను? హాఁ! ఏమని చెప్పుదు? నా వ్యధ వర్ణనా తీతం బయ్యెడిన్!
సుం:-ఒరే! ఛంపేస్తాను. మళ్లీ మొదలెడతావా నీ తెలుగు?!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|