|
|
Articles: Short Stories | కొరికింది - Mr. krishna madugundu
| |
ఏ కుక్కైనా ఎందుకు కొరుకుతుంది. నీవు వెకిలి చేష్టలు ఏమైనా చేసుంటావు. అందుకే అది మీద పడి కొరికి వుంటుంది అంటూ కసురుకుంది.
నొప్పి నొప్పి అని అరిచాడు బాధను భరించలేక. ఏడ్పొచ్చింది నాగభూషణానికి.
నువ్వేం మగాడివయ్యా అనబోయి కాలు చూసి కరిగిపోయింది. అయ్యోయ్యో అదేంటండీ అలా వాచిపోయింది పాదం అంది. పాడు కుక్క ఎంత పని చేసింది అని కుక్కని తిట్టి పోసింది.
కొరికింది కుక్క కాదు. చెప్పు. బొబ్బ పగిలి రక్తం చిమ్మింది. చర్మం చీరుకుపోయింది. నేను చెప్పానా కొల్హాపూర్ చెప్పులొద్దూ, సోలాపూర్ చెప్పులైతే మంచిదని. నీవు విన్నావా. నాకు ఇష్టం లేకపోయినా బలవంతాన తొడిగించావు అని బాధపడ్డాడు నాగభూషణం.
కొత్త చెప్పులు ఏమైనా అంతేలే ఓ చిన్న మాట విసిరేసి వంట గదిలోకి వెల్ళిపోయింది సుభద్రమ్మ. బిక్క మొహం వేసి చూశాడు ఆమెవైపు.
లోపలికి వెళ్ళినావిడ మరలా వెనక్కి వచ్చి మధుమతి ఎందుకు లేదు, ఎక్కడికి వెళ్ళిందట అని ప్రశ్నించింది.
సినిమాకు వెళ్ళిందంటా నీరసంగా బదులిచ్చాడు.
అనుకున్నాను. నువ్వు వెళ్తే పని కాదని తిడ్తూ అంది.
నాగభూషణం ఏం మాట్లాడకుండా నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు. ము... మూ... అంటూ మూల్గ సాగాడు.
సుభద్రమ్మ భర్త బాధని చూడలేక ముందు ఆ ఏడుపు ఆపి ఈ మందు రాసుకోమని అయింట్ మెంట్ ను అతనిపైకి విసిరేసింది.
ఆయింట్ మెంట్ పాదాలకు పూసుకోగానే చల్లదనం సోకింది. మంట కాస్త తగ్గగానే హాయిగా ఉన్నట్టు అనిపించింది.
ఆయింట్ మెంట్ లో వున్న చల్లదనం నీలోనూ వుంది. పైకి కఠినత్వం కనిపించినా లోపల మెత్తదనం వుంది. మొగుడి బాధ తెలుసుకున్నావు కాబట్టే ఆయింట్ మెంటును ఇచ్చావు. నిన్ను అనవసరంగా రాక్షసివి అనుకున్నాను. కాని చాలా మంచిదానివని భార్య మనసు కరిగేలా చక్కగా మెచ్చుకున్నాడు. హా...! భార్యాభర్తల అనుబంధం అంటే ఇదే అనుకొని ఆనందపడ్డాడు.
సుభద్రమ్మ భర్త కాలుకు గాయమైన చోట కట్టు కట్టింది. మనం ఒకరికొకరం తోడు అంది చిరు నవ్వుతో మెల్లగా దగ్గరవుతూ సుభద్రమ్మ.
నాగభూషణం ఆనందానికి అంతే లేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|