|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
నారాయణ: అంత అమాయకుడినా? ఎవరికీ చెప్పనమ్మా!
సీతమ్మ: మంచిది నాయనా!... కాళ్ళూ, చేతులూ కడుక్కొనిరా ఇందాకే ఆకలన్నావు... చక్కగా తిందువుగాని...
నారాయణ: కాళ్ళూ, చేతూ కడుక్కునే వచ్చానమ్మా!... రా ఇద్దరం కలిసి తిందాం...
సీతమ్మ: (కంగారుగా)... నేను ఇంటిదగ్గర తినే వచ్చాను... నీకు
వడ్డిస్తానులే... ఇలా వచ్చి కూర్చో...
(మూట విప్పి పళ్ళెంలో పెట్టబోతుంది. ఇంతలో నారాయణ ఆమె వెనుకకు వచ్చి నాగలితో ఆమె తలపై పెద్ద దెబ్బ వేశాడు. ఆమె కొన్ని క్షణాలు గిలగిలా కొట్టుకొని చనిపోయింది.)
నారాయణ: హమ్మయ్య! అనుకున్నట్టు చేసేశాను. ఈ శవాన్ని ఎవరూ చూడకుండా ఆ పొదల్లోకి లాగేస్తాను.
(లాక్కుంటు వెళ్ళి, ఒక్కడూ తిరిగి వచ్చాడు)
కాస్త చీకటిపడేదాకా ఇక్కడే ఉండి... ఈ ధనలక్ష్మిని ఇంటికి తీసుకు వెడతాను...ఇది అమ్మచేతి చివరి వంట!..హాయిగా తిని ఆకలి తీర్చుకుంటాను...
(రెండు, మూడు ముద్దలు తిని 'మంట... మంట... విషం... విషం అంటూ పడిపోయాడు)
వ్యాఖ్యాత:
'హలాగ్రేణ హతా మాతా
విషాన్నేన హతస్సుతః
మాతా పుత్ర విరోధాయ
హిరణ్యాయ నమోనమః'
చూశారా! ఈ విషాదాంతం! కనీసావసరాలు తీరేటంత డబ్బు మాత్రమే ఉన్నంత వరకు - ఆ తల్లీ, బిడ్డ ఒకరిమీద ఒకరు సహజమైన ప్రేమాభిమానాలతో ఆనందంగా ఉన్నారు. కళ్ళు చెదిరేటంత కలిమి వచ్చిపడగానే ఆ ప్రేమాభిమానాలు ద్వేషాలుగా మారిపోయాయి.
ఆర్థిక విషయమే బీజమై ఎన్ని దురాలోచనల విష వృక్షాలు సమాజంలో ఎదుగుతున్నాయో మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. ధనవంతులందరూ ఇలాగే ప్రవర్తిస్తారని కాదు. మితి మీరిన ధనదాహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది.
'కాలికి సరిపడు చెప్పుల వలెనే
సరిపడు ధనమే మనిషికి సుఖదమూ అన్న భగవాన్ సత్యసాయి బాబా సందేశం ఎంత విలువైనది!
ధనవ్యామోహం లో మానవత్వపు విలువలు విస్మరించని విధంగా మనను సంరక్షించవలసిందిగా దైవాన్ని వేడుకుందాం.
('హలాగ్రేణ... 'అనే ఈ సంప్రదాయ శ్లోకం ఆధారం గా కల్పిత పాత్రలతో ఈ నాటిక రూపొందింపబడింది)
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|