|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
శిరిడి సాయినాధుని దర్శనాభిలాషులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఈ వివరాన్నీ శిరిడి దర్శిని గ్రంధం ద్వారా కొండూరి కామేశ్వరరావు (జన్మస్థానం : తెనాలి) ప్రస్తుత నివాసి పాత బోయినపల్లి, సికిందరాబాద్ వారి ద్వారా సంకలనం చేయబడినది.
చాంద్ పాటిల్ కి బాబా దర్శనమిచ్చిన స్థలం - దేవగిరి : సాయిగిరి : ఇది శిరిడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పవిత్ర స్థలం ఔరంగాబాద్ శివార్లలో ఉన్నది. దేవగిరి కొండల శ్రేణిలో ఉన్న ఈ ప్రాంతం దెవలి గ్రామాన్ని దాటి సింధోం, బింధోం అణుజ్ కాంత గ్రామాలకు ముందు మార్గమధ్యలో ఉన్నది. ఇది ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి 20 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడే చాంద్ పాటిల్ కు ఆయన పోయిన గుర్రపు జాడను బాబా చెప్పారు. ఆ తరువాత ఇక్కడే ఆయన ప్రప్రధమంగా తన సటకాతో నేలపై కొట్టి నీరు నిప్పు పుట్టించినది. ఆ నిప్పుతోనే చిలుమును వెలిగించి చాంద్ పాటీలుకి ఇచ్చి తృప్తి పరచినది. అద్భుతమైన ఈ చమత్కారం చూసే చాంద్ పాటిల్ ఈ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప అవతార పురుషుడని నమ్మి తన ఇంటికి (ధూప్ ఖేడ్) తీసుకొని వెళ్ళాడు. అక్కడ మౌనధారి అయి బాబా ఒక నెల రోజులు దాపుననే ఉన్న వేపచెట్టు క్రింద కూర్చొని అందరినీ ఆకర్షించాడు. ఆ తరువాత ఒక వివాహ నెపంతో వారితో పాటు శిరిడి చేరి తన దివ్య ధామానికి తానే అధిపతి అయ్యాడు. చాంద్ పాటిల్ సమాధి ఈనాడు బాబా కూర్చున్నఈ చెట్టు కిందనే ఉన్నది.
దేవగిరి బాబా ప్రప్రధమంగా దర్శనమిచ్చిన ఈ చోటును ఈ మధ్యనే కొండూరి కామేశ్వరరావు, జి. వెంకటరావు అనేక ప్రయాసలు పడి కనుగొని అక్కడ దత్తయజ్ఞం చేశారు. ఆ తరువాత వారు రగడేతోనూ జాదవ్ తోనూ కలిసి అక్కడి స్థానికులకు ఈ విషయం చెప్పగా వారు సంతోషంతో సాయి మందిరం నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
Bolo Sadguru Shiridi Sayi nadha Maharaj Ki Jai!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|