|
|
Articles: Devotion | మహా శివరాత్రి మహత్యం - Site Administrator
| |
శివరాత్రినాడు పధ్నాలుగు లోకాల్లోని పుణ్యక్షేత్రాలూ బిల్వమూలాల్లో ఉంటాయి. కనుక ఆ రోజు ఉపవాసముండి బిల్వ పత్రాలతో శివలింగాన్ని పూజించాలి. కనీసం ఒక్క బిల్వపత్రంతో శివపూజ చేసినా పరమశివుడు ప్రీతిచెంది అనుగ్రహిస్తాడు.
శివరాత్రి నాడు ఫలం, జలం, కనీసం ఒక తోటకూర కట్ట అయినా దానం చేయడం ముక్తిదాయకం. వెండి కుందులలో ఆవునెయ్యి దీపం వెలిగించి ఒక మహాపండితుడికి దానం చేస్తే అజ్ఞానం నశిస్తుందంటారు.
శివరాత్రి తనకెంతో ఇష్టమని, ఆ ఒక్కరోజు భక్తులు ఉపవాసమున్నా తనెంతో సంతోషిస్తానని శివుడు పార్వతికి చెబుతాడు. శివరాత్రినాడు రాత్రి జాగారం చేయాలి. శివరాత్రి వ్రతం రాత్రిపూటే చేయాలి. ఎందుకంటే రాత్రిపూట శివుడు సంచరిస్తుంటాడు. కాబట్టి అప్పుడు పూజించాలి. శివుడిలోని భూత పురుషుడి ప్రాణులన్నీ జాగరుకతతో ఉంటాయి కనుక అప్పుడు శివుని పూజిస్తే ఆ పూజకు ఫలితం దక్కుతుంది.
రాత్రి జాగారముండి మర్నాడు బ్రాహ్మణుల్ని పిలిచి భోజనం పెట్టి తను భుజించాలి. అప్పుడు వ్రత సమాప్తి చేయాలి. శివరాత్రి నాడు ఉపవాసం చేసి, జాగరణ చేస్తే శివుడికి సన్నిహితులవుతారు. ఏడాదిపాటు నిత్య శివార్చన చేసిన ఫలం దక్కుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|