|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
మన బాసకు ఆకృతులు ఉండాయా అని ఆసక్తిగా అడిగినాడు ఎర్రన్న. ఆకృతులంటే అక్షరాలు. రామాయణంలోని లంకను కాల్చే కతను చెప్పినాడు. వాళ్లమ్మ పాడిన జోలపాటను పాడి వినిపించినాడు.
సుబ్బారెడ్డిని, 'నువ్వు పాములోడివా కోతులోడివా?' అని ప్రశ్నించినారు. ఇక్కడి కులాలను వివరించి చెబితే కూడా వాళ్లు తెలుసుకోలేకపోయినారు. వాళ్లకు తెలిసింది, తెలుగువాళ్లంటే పాములవాళ్లు, కోతులవాళ్లు... అంతే.
శ్రీలంకలో పాములవాళ్లకంటే కోతులవాళ్లు ఎక్కువున్నారట. బట్టికలోవ ప్రాంతంలో కోతులవాళ్లున్నారని ఎర్రన్న చెప్పినాడు. సుబ్బారెడ్డి బట్టికలోవకు పోదామని ప్రయత్నించినా అక్కడి ప్రభుత్వం అనుమతించలేదట.
పాములోళ్లు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంతవరకూ వాళ్లు కార్యాలు ఏమేమి ఎట్లెట్ల చేస్తారో ఎర్రన్న విశదంగా చెప్పినాడు. ఆంధ్రదేశంలో ఎట్లా చేస్తారని అడిగి తెలుసుకొన్నాడు.
చెబుతూపోతే చాలానే ఉంది. ముగించేస్తున్నాను. సుబ్బారెడ్డి వాళ్లనొక కీలకమైన మాట అడిగినాడు, తెలుగును ఇంక ఎంతకాలం నిలబెట్టుకోగలరు అని. నలభైయేండ్ల తిమ్మనన్న, 'మా మాట పొయ్యేలే, అల్లనే ఉండు' అని బదులిచ్చినాడు, వెంటనే డెబ్బయేండ్ల ఎర్రన్న అందుకొని 'ఏల పొయ్యేలే, నిన్న ఆట పొయ్యింది, నేడు పాట పొయ్యింది, రేపు మాట కూడా పోతాది' అన్నాడు.
ఎర్రన్న చెప్పింది నిజం. బాసంటే ఇంట మాటాడుకొనే నాలుగయిదు మాటలే కాదు, అంతకు మించి ఇంకేదో ఇంకెంతో ఉంది అని ఎర్రన్న చెప్పకనే చెప్పినాడు. ఎర్రన్నకున్న ఇంగితం ఆంధ్రదేశంలోని కొందరు తెలుగు పెద్దలకు లేదెందుకనో. తెలుగు కనుమరుగు కాబోతున్నదని ఎవరైనా అంటే ఈ పెద్దలు విరుచుకుపడుతున్నారు.
మూడేండ్లప్పుడు తిరుపతిలో జరిగిన ఒక పెద్ద తెలుగుసభలో పేరున్న తెలుగుకవి ఒకాయన అన్న మాటలను మరొక్కసారి వినండి. 'నేను పాతికేళ్లకు పైగా హైదరాబాదు నగరంలోని పూసలవాళ్లను గమనిస్తున్నాను. ఆ రోజు వాళ్లెట్లా వాళ్ల భాషలోనే మాట్లాడుకొనేవారో ఈ రోజుకీ అట్లాగే మాట్లాడుకొంటున్నారు. చాలా చాలా కొద్ది సంఖ్యలో ఉన్న పూసలవాళ్ల భాషే సజీవంగా ఉండే, ఇన్ని కోట్ల మంది మాట్లాడే తెలుగు అంతరించిపోతున్నదంటూ కొందరు అనడం హాస్యాస్పదం'.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|