|
|
|
|
Articles: Short Stories | పోరాటం - Editor
| |
అయితే భారీ సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు మహిళలను లాగివేయడం ప్రారంభించారు. ఈ తొక్కిసలాటలో అప్పటిదాకా జనంలో నుంచొని చూస్తున్న శివకు ఆఫీసర్ కారును డ్రైవరు ముందుకు పోనిస్తుంటే, శరీరమంతా అడ్డమేసి కారును ఆపుతున్న బాలకోటి కన్పించాడు. ఇంతలో అక్కడే ఉన్న ఒక పోలీసు బాలకోటి నెత్తిపై కర్రతో గట్టిగా కొట్టడంతో రక్తం కారుతున్న కోటిని చూడగానే శివకు ఒక్కసారిగా పూనకమొచ్చినట్లయింది. అంతే కోటిని పక్కకు లాగి కింద పడుకున్నాడు శివ 'ఇప్పుడు పోనివ్వండి కారును' అంటూ. అతన్ని లాగి వేయడానికి చుట్టుముట్టిన పోలీసుల్ని నెట్టుకుంటూ ముందుకొచ్చిన ఆడవాళ్ళంతా రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. మా మీదుగా ఊళ్ళోకి పొండి' అంటూ హోరెత్తుతున్న ఆ జనాన్ని, వారి దృఢ నిశ్చయాన్ని గమనించిన ప్రభుత్వాధికారులు అప్పటికి వెనక్కి తగ్గారు.
వెనుదిరిగిన వాహనాలను చూసి శాంతించిన గ్రామస్తులనుద్దేశించి శివ 'ఈ విజయం తాత్కాలికమే! దీనిని శాశ్వతంగా పొందాలంటే మనమంతా ఇదే విధంగా ఐకమత్యంతో పోరాటాన్ని కొనసాగించుదాం!' అన్నాడు.
గాయానికి కట్టు కట్టించుకుంటున్న కోటి సుభద్రతో 'చూశావా పిన్నీ! ఎక్కడో కాలేజీలో చదువుకుంటున్న శివ, కాలేజీ వదిలి ఇక్కడ ఉండేవాడిలా కబుర్లు చెబుతున్నాడు' అన్నాడు నవ్వుతూ.
బాలకోటి మాటలకు స్పందిస్తూ శివ నిజమేరా! చదువు అనేది ముఖ్యమే, కానీ జీవితాన్ని మించి కాదు. కాలేజీ చదువును మనదైన ఈ జీవితం ధ్వంస కాకుండా చేసే పోరాటం కోసం ఈ క్షణమే వాయిదా వేస్తున్నాను. మనందరి సమస్యకు పరిష్కారం కోసం పోరాడుతున్న మీ అందరితో కలిసి పోరాడటమే ఇప్పుడు నా కర్తవ్యం. సెజ్ వ్యతిరేక పోరాటాలు చేసి సెజ్ ను రద్దు చేసేవరకూ విశ్రమించక పోరాడిన ప్రజానీకమే మనకాదర్శం, వారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాడదాం! అన్నాడు దృఢంగా.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|