|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
దారిలో సుజాత మౌనంగా ఉంది. తుఫాను ముందు ప్రశాంతత అనుకున్నాడు సురేష్. ఎంత ఆలోచించినా తన తప్పేమీ కనిపించలేదిందులో.
ఇంటికి చేరగానే, 'నేనిండియా వెళ్ళిపోతాను. టికెట్ తీసుకోండి' అని చెప్పింది సురేష్ తో.
'ఎందుకూ?' అడిగాడు సురేష్.
'మీకు తెలియదా?' ఎదురు ప్రశ్న వేసింది.
'ఇప్పుడు జరిగినదాంట్లో నా తప్పేముందీ... ఇంకో లాయర్ని కలుద్దాం' అన్నాడు సురేష్.
'పదండి కలుద్దాం... ఈసారి విడాకులిప్పించే లాయర్ని' అంది.
'ఎందుకూ ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తావ్. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వసలు ఇండియా వెళ్దాం అనబట్టే కదా నేను తొందర తొందరగా డబ్బు సంపాదించడానికి ట్రై చేసింది' ఎదురు దాడి మొదలు పెట్టాడు సురేష్.
సుజాతకు ఏమి మాట్లాడాలో పాలుపోక, సురేష్ వంక గుడ్లప్పగించి చూస్తుండిపోయింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|