|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
ఇంకా శాసనసభలో దాదాపు ముప్పయి బీసీ కులాల వారికి చిరంజీవి టిక్కెట్లు ఇచ్చారు. ఇందులో 14-16 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడపనే తొక్కని కులాలున్నాయి. ఇదే సందర్భంలో బీసీలకు 67 టిక్కెట్లు ఇచ్చి ఇప్పటికే ఎక్కువ ఇచ్చామని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అనవసర ప్రకటన చేశాడు. వందపైగా సీట్లు ఇస్తానని బీరాలు పలికిన చంద్రబాబునాయుడు కేవలం 65 సీట్లు మాత్రమే ఇచ్చి ఊరుకున్నాడు. ఈ 67, 65ల్లో తప్పనిసరిగా ఓడిపోయే హైదరాబాద్ లో ఎం.ఐ.ఎం. స్థానాలు కొన్ని ఉన్నాయి. మొత్తం మీద ఈ ఇరు పార్టీలు బీసీలకు 'ఇది మీ స్థాయి, ఇది మీ పాలు' అని స్పష్టంగా చెప్పాయి. ఇది ప్రతికూల ఫలితాన్ని ఇస్తే ఈ పార్టీలు అధికారంలోకి రావడం కష్టం అవుతుంది.
కానీ టిక్కెట్ల పంపిణీలో చిరంజీవి భారీ ప్రయోగమే చేశారు. ఎల్లారెడ్డి లాంటి జనరల్ స్థానాలలో లంబాడీ యువతికి టిక్కెట్ ఇవ్వడం, స్పీకర్ సురేష్ రెడ్డి లాంటి నాయకుడు పోటీ చేస్తున్నచోట ఒక ఎస్సీ డాక్టర్ కు టిక్కెట్ ఇవ్వడం సాహసమే అవుతుంది. లేదా రాజకీయ సమీకరణలు తెలియని అజ్ఞానం అయినా అవుతుంది.
అరవింద్ అనకాపల్లి వెల్లడం అవసరమా అనుకొనే వారున్నారు. అది వేరే విషయం. ఖచ్చితంగా గెలిచే నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఆయన నిలబడక ఒక బీసీ అభ్యర్థిని ఎం.పీ.గా నిలబెట్టడం విశేషమే. ఈ సీటు ఇవ్వనందుకే పరకాల ప్రభాకర్ పార్టీని విషవృక్షమని నిందించి బయటకు వెళ్ళింది. అరవింద్ ను ప్రశ్నించేవారు నరసాపురం ఉదంతాన్ని కూడా దృష్టిలో ఉంచుకొంటే పి.ఆర్.పి. వారి వ్యూహం అర్థం అవుతుంది. నర్సాపురం నుండి గతంలో ఎంపిగా గెలిచిన కృష్ణంరాజు కూడా ఆ స్థానాన్నే కోరుకున్నారు. అక్కడ ఆయన సామాజిక వర్గంవారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. కాని పార్టీ ఆయనను రాజమండ్రిలో నిలబెట్టింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే చిరంజీవి, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వారు పోటీ చేస్తున్నారు. ముదిరాజులే సభ్యులుగా గల మన పార్టీ లాంటి వారితో పొత్తు పెట్టుకోవడం గమనార్హమే.
తెలంగాణలో దాదాపు సగం నియోజకవర్గాల్లో ముదిరాజ్ లు, మున్నూరు కాపులు, గౌడులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారు. దేవేందర్ గౌడ్ ఎన్.టి.సి.పి విలీనం వల్ల తెలంగాణలో ఎక్కువ శాతం గౌడ్ ఓట్లను పి.ఆర్.పి ఆకర్షించే వీలు కలిగింది. ఈ ఆకర్షణను తగ్గించడానికి కాంగ్రెస్ తెలంగాణలో ముగ్గురు గౌడ కులస్థులకు ఎం.పి.టిక్కెట్లు ఇచ్చింది. కోస్తా, రాయలసీమల్లో ఎవరూ ఊహించని విధంగా ముస్లీంలకు పి.ఆర్.పి. టిక్కెట్లు ఇవ్వడం వ్యూహాత్మకమే. ఎస్.టి.లకు, ముస్లింలకు ఇలా టిక్కెట్లు ఇవ్వడం విశేషం. 5 జనరల్ స్థానాల్లో గిరిజనులకు టిక్కెట్లు ఇవ్వడం కూడా వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే చిరంజీవి మాస్ అప్పీల్ దానికి తోడైతే ప్రజారాజ్యం పార్టీ మెజార్టీ సాధించడం ఖాయం అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|