|
|
Articles: Short Stories | సామాన్యుడి కోరిక - Site Administrator
| |
అంతే కాదు స్వామీ... కడుపులో కింత ముద్ద పడేసుకోడానికి... ఇదిగో ఇలాంటి సీసాకాయలిత్తారు. ఇంకా సానా... చేస్తున్నారు స్వామీ...' ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలో కల్పించుకొని స్వామి అన్నారు ' అన్నీ చెప్పావు... అసలు కారణం చెప్పలేదు. నువ్వు ఏ పార్టీకి మెజారిటీ రాకూడదని ఎందుకు కోరుకున్నావు?'
'అక్కడికే వస్తున్నాను అయ్యోరూ! ఎవుళ్ళకీ మెజారిటీ రాకపోతే స్వామీ.. కొన్ని పార్టీలు ఏకమై కొద్ది మెజారిటీ కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అదో అతుకుల బొంత. అందులో ఎవరికి కోపం వచ్చినా ప్రభుత్వం పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలంటే వాళ్ళళ్ళో వాళ్ళు సద్దుకొని మళ్ళా ఎలక్షన్ల కోసమైనా కాస్త ప్రజలను పట్టించుకుంటారేమోనని ఆశ. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎలక్షన్స్. అంటే మల్లీ మాకు పండగొచ్చినట్టే. అందుకే స్వామీ... అలా కోరుకుంటున్నాను. తప్ప కుండా నా కోరిక తీర్చుస్వామీ... తీరుస్తావులే ఎల్లొస్తా.... స్వామీ' అంటూ వెనుతిరిగాడు ఆ ఓటరు మహాశయుడు.
అంతే.. అప్పటిదాకా ఆలయమంతా నిండి వున్న వెలుగులు అదృశ్యమైపోయాయి. యథాప్రకారం ఆలయాంతర్భాగంలో శిలలా నిలబడిపోయారు స్వామి. 'ఏం చేయాలా...' అన్న ఆలోచనతో..
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|