|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
ఇలాంటి అనుభవాలు కర్మయోగులకు తప్ప మరెవ్వరికీ జరుగవేమో. నిజంగా రామయ్య జీవనసరళిలో బాబా అనుగ్రహం ఎంతో ఉండబట్టే కర్మయోగిలా జీవించగలిగారనటంలో అతిశయోక్తి లేదు. వారు చిరస్మరణీయులు. వారి పేరు మీద ఒక ధార్మిక ట్రస్ట్ పెట్టి బీద విద్యార్ధులకు, పేదలకు సహాయపడాలని వారి కుటుంబసభ్యులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతేకాక సాయిబాబా అనుగ్రహం వారి కుటుంబంలోని వారి కుమారులపై కూడ ప్రసరిస్తున్నది. దీనికి దృష్టాంతంగా ఔరంగాబాద్ లోని సాయి పంచగురుధామం సందర్శించినప్పుడు ఒక విచిత్రం జరిగినట్లుగా తెలిసింది.
రామయ్య గారి కుమారులు తమ తండ్రి కాలంచేసిన తరువాత మనశ్శాంతికై తమ తల్లిని తీసుకుని తమ కుటుంబంతో కలిసి యాదృచ్చికంగా రామయ్య గారి తీరని కోరిక అయిన సాయి పంచగురుధామానికి వెళ్ళారు. ఆ రోజు శివరాత్రి పండుగ. అక్కడ ఉన్న సాయిబాబాను, వారి సన్నిధిలో ఉన్న శివలింగాన్ని దర్శించి ధ్యానమందిరంలో కూర్చుని ఉండగా అక్కడ ఆ రోజు అశ్వమేధ యాగం జరుగుతున్నదని, దాని కోసం ఋత్విక్కులు వచ్చారని తెలిసింది. అంతలో యాగ బ్రహ్మ రామయ్య గారి కుమారుని పలకరించి మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా యాగంలో పాల్గొనవచ్చునని తెలిపారు. కాని రామయ్య గారి కుమారునికి ఒక సందేహం కలగడంతో వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే వారి తండ్రి కర్మకాండలు చేసినందువలన తాను ఈ క్రతువులో పాల్గొనటం దోషపూరితమేమో అని తన సందేహాన్ని యాగబ్రహ్మకు తెలిపారు. అప్పుడు యాగబ్రహ్మ దోషపూరితం అనే సంశయం నీలో ఉంటే నీవు కంకణధారణ చేయకు, ఋత్విక్కులకు సంభారాలు అందించటంలో సహాయపడు. ఇది బాబా ఆజ్ఞ. ఏ దోషమూ ఉండదని తెలియచేశారు.
ఆహా బాబా లీలలు ఎంత విచిత్రాలో కదా! రామయ్య గారి అస్తి నిమజ్జనం సమయంలో దత్తాత్రేయశర్మ ద్వారా కార్యక్రమం చేయించినపుడు శర్మ తను యాగ కార్యక్రమంలో ఉన్నా ఆ కార్యం వదిలి వచ్చి రామయ్య గారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయించినందుకు ఈ రోజు వారి కుమారుని ద్వారా బాబా తన సమక్షంలో తన ఆజ్ఞానుసారంు జరుగుతున్న అశ్వమేధ యాగ కార్యక్రమానికి సహాయపడే విధంగా అనుగ్రహించారు అని తెలుస్తున్నది. నాగార్జునసాగర్ లో ఆ నాడు జరుగుతున్న యాగంలో దత్తు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ నాడు రామయ్య గారి కుమారుని ద్వారా బాబా చేయించుకున్నారు. ఈ సంఘటన వారి ఇంట ప్రతి వారమూ జరిగే సత్సంగ సమావేశంలో సాయి భక్తులకు తెలియచేశారు. వారు కూడా ఆశ్చర్యం చెందారు. బాబా అనుగ్రహం పొందిన ఆ కుటుంబం ఎంతో ధన్యం కదా!
'సద్గురు సచ్చిదానంద పావనమూర్తి సాయినాధ మహారాజ్ కీ జై'.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|