|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
ఇక్కడ డబ్బుందా లేదా అన్నది ప్రశ్న కాదు... ఇదే కనుక ఏ చదువుకునే కుర్రాడో ఫీజుకి డబ్బుల్లేవంటే మారు ప్రశ్న వెయ్యకుండా వేలిచ్చేస్తాం... కాని మనకి కాలక్షేపం కోసమంటూ అన్ని వేలు ఖర్చంటే... నసిగాడు శంకర్రావు.
నిజమే... ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో దానిని సద్వినియోగపరచడానికి కూడా అంతగా ఆలోచించాలనుకునే మనిషి కనుక ఆ ఆలోచనను మనసులోంచి తీసేసింది సుమతి.
మరింకిప్పుడేం చెయ్యడం? సరే... కాసేపు వరలక్ష్మితో మాట్లాడితే సరి.... ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్. ఈ మధ్య ఎక్కడా కలవలేదు. కబుర్లు చెప్పుకుంటే కాసేపు కాలక్షేపం అయిపోతుంది. అనుకుంటూ ఫోన్ తీసి వరలక్ష్మికి డయల్ చేసింది. హలో వరలక్ష్మీ నేను సుమతిని ఏం చేస్తున్నావ్?
చాలా రోజుల తరువాత సుమతి గొంతు విన్న వరలక్ష్మి సంతోషించింది.
ఒసే! సుమతీ! నేను ఓ గంటయ్యేక ఫోన్ చేస్తానే.... ఏమీ అనుకోకు. అంది చనువుగా
పన్లోవున్నావేంటే సరేలే...
అహ... పనేం కాదు. టీవీలో చావు నీదా - నాదా అన్న సీరియల్ వస్తోంది. అత్తా కోడలు ఒకర్నొకరు చంపడానికి ఒకర్ని మించి మరొకరు ఎత్తులు వేస్తున్నారు. అయ్యబాబోయ్... యాడ్స్... అయిపోయాయ్... సీరియల్ వచ్చేస్తోంది. నేను మళ్ళీ చేస్తాలేవే... ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి. సుమతి మొహం తేటపడింది. తన సమస్యకి పరిష్కారం దొరికింది. ప్రొదుట్నించీ సాయంత్రం దాకా కూర్చుని టీవీలో వచ్చే సీరియల్సన్నీ చూసేస్తే సరి... వెంటనే టీవీ ఆన్ చేసింది.
హాల్లోంచి గొల్లుమని ఏడ్పులు వినిపించిన శంకర్రావు చేతిలో పేపరుతో ముందుగది లోంచి పరిగెత్తుకొచ్చాడు. టీవీ స్క్రీన్ మీద హాస్పిటల్ సీన్. స్ట్రెచర్ మీద ఎవరో మనిషి చుట్టూ ఓ ఇరవై మంది... కొంతమంది గొంతు పెంచ్చి ఏడుస్తుంటే, మరికొంత మంది నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నారు. ఇంకొంత మంది మొహాల్లో ఎదురుగా విషాదం కనిపిస్తుంటే వాళ్ళ మొహాలే పక్కకి తిరిగి వెటకారంగా నవ్వుతున్నట్టున్నాయి.
ఏమీ అర్థం కాలేదు శంకర్రావుకి. సుమతిని చూశాడు తదేకంగా స్క్రీన్ నే చూస్తోంది. డిస్ట్రబ్ చెయ్యడమెందుకని అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఒక్క సీన్ కూడా మిస్సవకూడదని కుర్చీలో ముందుకు వంగి మరీ చూస్తోంది సుమతి సీరియల్స్ ని.
అత్త వంటింట్లో పాలు కాస్తోంది. కాచిన పాలు ఓ గ్లాసులోకి తీసి అక్కడ పెట్టి ఎందుకో పక్కకి వెళ్ళింది. ఆ క్షణంలోనే కోడలు వచ్చింది. నడుంలో దాచుకున్న సీసా తీసి చేతిలో పట్టుకుని చూసింది. `పాయిజన్' అన్న అక్షరాలు క్లోజప్పులో తాటికాయలంతేసి చూపించారు. ఆ విషాన్ని అక్కడున్న గ్లాసుపాలల్లోనూ పాలల్లో పంచదార కలిపినంత తేలిగ్గా కలిపేసి వెళ్ళిపోయిందా కోడలు. హడలిపోయింది సుమతి. అసలామెకి చేదుగా ఉన్న మాత్రలేసుకోవడమంటేనే ప్రాణాంతకంగా ఉంటుంది. అటువంటిది విషం కలిపిన పాలు ఎవరికిస్తుందో బాబోయ్ అనుకుంటూ మరో ఛానల్ కి తిప్పింది.
అక్కడి యాంకర్ బహుశా కొత్తగా పళ్ళు కట్టించుకుందేమో... అవన్నీ కనపడేలా నవ్వుతూ ఏదో పాట గురించి చెబుతోంది. ప్రేక్షకులు కోరిన పాట వెయ్యుచ్చు కదా ఈ పిల్ల... అబ్బే వెయ్యడం లేదు. ఆ ఫోన్ చేసిన వాళ్ళ క్షేమసమాచారాలు కూడా కాదు... ఆ రోజు వాళ్ళింట్లో వండిన వంకాయకూర ఎవరు వండారో... ఎలా వండారో... ఎలా వడ్డించారో అది ఎవరెవరు తిన్నారో... దాని గురించి ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు ప్రకటించారో అన్నీ తీరుబడిగా కూర్చొని వివరంగా అడుగుతోంది.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|