|
|
Articles: TP Features | అలెగ్జాండరే కుమారస్వామి! - Site Administrator
| |
భారతదేశంలో గ్రీకు నాగరికత ప్రభావం అలెగ్జాండర్ తో మొదలయ్యింది కాదు. అతనికి అనేక వందల ఏళ్ళకు పూర్వం దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా డెక్కన్ భూభాగం నుంచి గ్రీస్, రోమ్, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలతో సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్ లోని అనేక ప్రాంతాలతో వర్తక వాణిజ్య సంబంధాలు నడిచాయి.
అలెగ్జాండర్ కు భారతదేశం కొత్తగానీ, దక్షిణాది ప్రజలకు ముఖ్యంగా ఆనాటి తెలుగువారికి గ్రీకులూ, పర్షియన్లూ చిరపరిచితులే!
కుమారస్వామి మతాన్ని అలెగ్జాండర్ తెచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టాడని, స్వయంగా అలెగ్జాండరే కుమారస్వామి అనీ, ఆ విషయాన్ని గ్రహించలేకపోయిన భారతీయులు అలెగ్జాండర్ ని మాములు మనిషేనని అనుకున్నారని తమిళులు ఈ వ్యాసంలో మనల్ని ఎద్దేవా చేయడాన్ని గమనించవచ్చు. అలెగ్జాండర్ ఇండియా జయించాడని, భారతీయులు అతనికి బానిసలయ్యారనీ బుకాయిస్తూ, తమిళులు తామే గ్రీకులం అన్నంతగా రాసుకొంటున్నారు.
బ్రాహుయా తర్వాత తల్లిద్రావిడంలోంచి మొదటగా తెలుగుభాషే విడివడిందనీ, ఆ తర్వాతే తమిళ, కన్నడాలు రూపొందాయని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రభృతులు పేర్కొన్న చారిత్రక సత్యాన్ని తమిళులు ఎన్నడూ విననట్టే నటిస్తారు. ఆఫ్రో ఆసియాటిక్ భాషా కుటుంబంలో తల్లి ద్రావిడ భాషా పదాలు కన్పిస్తాయి. అవి తమిళం కన్నా తెలుగు భాషకు ఎంతో దగ్గరగా ఉంటాయి. ప్రాచీన ఆఫ్రికన్, సుమేరియన్, ఇలమ్ భాషలలో మనం ఇలా ఎన్నో తెలుగు పదాలను గమనించవచ్చు. తమిళంలో వాడుకలో లేని కేవల తెలుగుపదాలెన్నో కన్పించాయక్కడ. ఇండో యూరోపియన్ భాషలలో కూడా ఇలాంటి తెలుగుపదాలు కన్పిస్తాయి.
ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, తల్లిద్రావిడ భాష వ్యాప్తిలో ఉన్నకాలంలో జరిగినవిగా భావిస్తున్న చారిత్రక పరిణామాలన్నింటినీ తమిళులు సొంతం చేసుకొని దానిని తమిళ ప్రాచీనతకు తార్కాణంగా చూపిస్తున్నారు. తమిళుల ప్రాపకాన్ని పొందిన కొందరు విదేశీ పరిశోధకులు దీనిని ఎరగనట్టు మౌనం పాటిస్తున్నారు. కొద్దిమంది తెలుగు పరిశోధకులు తమిళుల మాట నిజమేననే భావనలో కూడా ఉన్నారు.
తల్లి ద్రావిడ భాషా కాలంనాటి పరిణామాలు వారసత్వాన్ని తెలుగుభాష అందుకున్నాకే తమిళభాషను చేరాయి. తెలుగువారికి సంబంధం లేకుండా కేవలం తమిళుల ప్రాచీనత గురించి మాట్లాడడం చిన్నతమ్ముడే ముందు పుట్టాడని బుకాయించడం లాంటిది!
తెలుగుభాషకి, తెలుగుజాతికీ, తెలుగు చారిత్రక వైభవానికీ అన్యాయం జరగకుండా ఉండాలంటే, తెలుగువారు మేల్కొని ఇలాంటి బుకాయింపులకు దీటుగా సమాధానం చెప్పాలి!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|