|
|
Articles: TP Features | భావం పరాయీకరణ - Site Administrator
| |
ఉత్పత్తి రంగంలో తెలుగుజాతి వారసత్వ సంపద క్రమంగా అంతరిస్తున్నది. సుస్థిర వికాసం కోసం సంప్రదాయ విజ్ఞానం వైపు ప్రపంచమంతా దృష్టి సారిస్తుంటే, కనీసం ఆ ఆలోచనే తెలుగువారికి లేకపోవడం విచారకరం.
1960లలో తయారైన వృత్తి పదకోశాలలో ఎన్ని పదాలు వ్యవహారం నుండి తొలగిపోయాయి? ఎన్ని కొత్తవి వచ్చాయి? ఎన్ని ఆంగ్ల పదాలు నిరక్షరాస్యుల నోళ్ళలో నలుగుతూ ఎటువంటి మార్పులు పొందాయి. వీటిని గమనించడంతో పాటు ఇప్పటివరకు జానపద - గిరిజన సాహిత్యం మీద జరిగిన పరిశోధనలు వెలికితెచ్చి పదసంపదతో ఒక నిఘంటువును విషయం వారీగా తయారుచేయడం ఈనాటి అవసరం. ఇప్పటి వరకు ఆయా వృత్తుల, జాతుల సాహిత్యాల మీద పనిచేస్తున్న పరిశోధకులు, దేశీయ విజ్ఞానంతో చోటుచేసుకున్న మార్పుల మీద కూడా అధ్యయనం చేయాలి. ఇంతవరకూ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలను, విభాగాలను గుర్తించకపోతే ఈ కృషి కాళ్లు, చేతులు లేకుండా అసమగ్రంగానే మిగిలిపోతుంది.
ఉత్పత్తి సాధనాల వలెనే భాష ఒక సజీవమైన సాధనం. ఇంతకాలం చదువుకున్నవాళ్ళు, చదువురానివాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించని ఫలితంగా భాష ఒక సమాచార సాధనం స్థాయికి దిగజారిపోయింది. చదువు రానివాళ్ళు చదువుకోవాలి - తెలుగు భాషలో రాయాలి, మాట్లాడాలి అనే లక్ష్యంతో పాటు ఏ చదువు, ఎవరి చదువు అనే ప్రశ్న వేసుకోకపోతే కొంతకాలం భాష కొనసాగవచ్చు - భావం మాత్రం పరాయిదైపోతుంది. అన్యదేశ్యాలు అపభ్రంసాల వాడకం పెరిగిపోతుంది. భాష కూడా క్రమంగా క్రుంగి కృశించిపోతుంది.
ప్రభుత్వ ఉత్తర్వులు, పత్రికలు, రచనలు చదవడానికే కాదు, ఉత్పత్తి పెంచేవారు కాలానుగుణంగా వచ్చే మార్పులకు సర్దుకోవడానికి భాష ఉపయోగపడాలి. ఉత్పత్తిని పెంచే శ్రామికుని జ్ఞానానికి శాస్త్రగౌరవం తేవాలి. సంప్రదాయం - సాధికారిత అనే జోడుగుర్రాల మీద స్వారీ చేయగల రథికులు, సారథులు మనకు కావాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|