|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
[స్టేజి మీద లైట్లు అన్నీ వెలుగుతాయి. దీని వల్ల ప్రేక్షకులకు సిల్ హౌట్ కనిపించదు. (fades out technique of lighting) కంగారుగా చంచలరావు గదిలోంచి ఒక స్త్రీ (ఇందాక వెళ్లిన అమ్మాయి మాత్రం కాదు) మరో అమ్మాయి బయటకు వస్తుంది అప్పటికే వీధిలోంచి చంచలరావు భార్య వచ్చి తన గదిలోకి ఎమ్.బి.లోకి వెళ్లబోయి.. ఆగి, ఆర్.ఎఫ్.లో జరుగుతున్న భాగోతం ఏమిటా అని ఆర్.ఎఫ్. వైపు వెళ్లి లోనికి తొంగిచూసి, కంగుతిని, కోపంగా రెండడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడే లోపల్నించి మరో అమ్మాయి బయటకు వచ్చి కంగారుపడి బెదిరిపోతూ వీధిలోకి చిన్న సైజు పరుగులా వెళ్లి పోతుంది. చంచలరావు భార్య రెండడుగులు ఆమె వెళ్లినవైపు వేసి, అటే చూస్తూ కోపంగా ఉండి పోతుంది.]
చంచలరావు : [(డ్రస్సు మారిపోయింది.. చొక్కాకు బొత్తాలు పెట్టుకుంటూ తూలుకుంటూ వస్తాడు. భార్యను మైకంలో గుర్తుపట్టడు.) First DIALOGUES ON STAGE NOW STARTS!)
చం : ఓహ్! కొత్త పిట్టలా ఉందే?! (దగ్గరకెళ్లి విశాల భుజంపై చెయ్యి వేస్తాడు.)
విశాల : ఊ.. ! (విసురుగా తన భుజంపై బడ్డ చంచలరావు చేతిని తోసేస్తుంది. కోపంగా చంచలరావుకేసి తిరిగి చూస్తుంది.)
చం : ఓ.. విశాలా?! నువ్వా? నువ్వెప్పు డొచ్చావు? సినిమాకెళ్లలేదూ?!
వి : ఛి!ఛీ!! ఇలాటి పాడుపనులు చెయ్యటానికి బుద్ధుండక్కర్లేదూ?
చం : విశాలా! ఏమిటి నేనంతగా చేసిన పాడుపని? మారిపోతున్న నవసమాజంలో నేను కూడా ఆనందం కోసం తాగడం తప్పా? వెరయిటీ చూడ్డం తప్పా?!
వి : ఛీ! ఇంకా సిగ్గులేకుండా మాటాడుతున్నారు. ఒక బజారుదాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లోనే, ఇంత బరితెగించి, తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీరసలు మనుషులు కారు.
చం : ష్! విశాలా! మెల్లిగా మాట్లాడు. కొంచెం నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇరుగూ - పొరుగూ వింటే మన పరువు పోతుంది.
వి : ఇంకెక్కడుందండీ మనకి పరువు? ఆ బజారుముండ ఈ ఇంట్లో కాలుపెట్టగానే మన బతుకులు బజారుకెక్కాయి.
చం : ఊ.. ! అయితే నీ ఇష్టమొచ్చినట్టు అరు. నా మొగుడు దుర్మార్గుడూ, జూదరీ, పచ్చి ముండల ముఠాకోరు అని ప్రచారం చెయ్యి! ఛి..ఛీ! అసలు నువ్వు ఆడదానివి కాదే?
వి : (గొంతు స్థాయి తగ్గించి) అవును. నేనంటున్న మాటలే మీకు కనిపిస్తాయి! కాని మీరు చేసిన తప్పు గురించి, చీమ కుట్టినట్లైనా ఉందా? పైగా నేను గట్టిగా మాట్లాడుతున్నందుకు రాక్షసిలా కనిపిస్తున్నాను, (ఉక్రోషం, ఏడుపు)
చం : నిన్నిప్పుడెవరూ రాక్షసి అనలేదే?
వి : కాకపోతే ఏమిటండీ! మీరెన్ని పాడుపనులు చేస్తున్నా నోరుమూసుకు కూర్చుంటే నేను మంచిదాన్నీ, మహా పతివ్రతనీ, లేకపోతే ఒక రాక్షసిని.. భర్తను బజార్లో పెట్టే ఓ పాతకిని. అంతేగా?!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|