|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
1882 అక్టోబర్ 19న హంటర్ కమిషన్ కు ఇచ్చిన విజ్ఞాపనలో విద్యావ్యవస్థలో మార్పులకు అనేక సూచనలు చేశాడు. విద్య అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలన్నాడు. 12 సంవత్సరాల వరకు నిర్బంధ ప్రాథమిక విద్య అమలు జరపాలన్నాడు.
1883 జూలైలో రైతుల కోసం ఒక పుస్తకం రాశాడు. అధి ఈ విధంగా ప్రారంభమౌతుంది.
చదువు లేక బుద్ధి వికసించదు
బుద్ధి లేక నీతి తగ్గుతుంది
నీతిలేక అభివృద్ధి ఆగుతుంది
అభివృద్ధి లేక ధనం మాయమౌతుంది
ధనం లేక శూద్రులు నాశనమౌతున్నారు
ఈ బాధలన్నీ నిరక్షరాస్యత వల్ల వస్తున్నాయి.
1885లో జోతిరావు వీలునామా రాశాడు. తన ఆస్తిని తను పెంచుకున్న కుమారుడు యశ్వంత్ కు ఇవ్వాలని, తన కుటుంబ ఆచార రీత్యా ఉప్పుతో సమాధి చేయాలని, దహనం చేయకూడదని, బ్రాహ్మణులెవరూ తన శవాన్ని తాకకూడదని, వారి నీడ కూడా పడకూడదని రాశాడు. 1890 నవంబర్ 27న ఆయన చనిపోయాడు. 1897లో భార్య సావిత్రీబాయి ప్లేగు వ్యాధితో చనిపోయింది. ఆమె చనిపోయిన ఎనిమిదేళ్ళకు పెంపుడు కొడుకు చనిపోయాడు. పూలే తన ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళడానికి అనేక రచనలు చేశాడు. వాటిలో గులాంగిరీ (దాస్యం) ప్రముఖపాత్ర పోషించింది. దీన్లో బ్రాహ్మణులు, ఇతర పురాణ పురుషుల చుట్టూ కల్లిబొల్లి కథలల్లి ఏ విధంగా మతాన్ని వాడుకొని శూద్రుల దుస్థితికి కారణమయ్యారో చూపించాడు. ఆ పుస్తకాన్ని నీగ్రోజాతి దాస్య విముక్తి కోసం అంకితమిస్తూ, అమెరికా ప్రజల్లాగే బ్రాహ్మణ దాస్యపు సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని వాంఛించాడు. పుస్తకం చివరలో తన మాట రాస్తూ పుస్తకం ఉద్దేశ్యం శూద్ర సోదరుల్ని బ్రాహ్మణులు ఎలా మోసం చేశారో చెప్పటం ఒకటే కాదని, బ్రిటీషు ప్రభుత్వం అనుసరిస్తున్న ఉన్నత విద్యావిధానం ఎంత హానికరమో చెప్పి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలన్నది తన ఉద్దేశమన్నాడు. ప్రతి గ్రామంలో శూద్రులకి పాఠశాలలు ఉండాలి కాని అందులో బ్రాహ్మణ ఉపాధ్యాయులు వద్దన్నాడు. తన రచనలు జనం భాషలో ఉండేవి. సంభాషణా పద్ధతిని ఉపయోగించేవాడు.
జోతిరావు ఫూలేకి బ్రాహ్మణ ద్వేషం లేదు. బ్రాహ్మణత్వం అంటే గిట్టదు.
దైవాదీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం,
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా
(ఈ జగత్తంతా దైవాధీనం. దేవుడు మంత్రానికి అధీనుడు.
ఆ మంత్రం విర్రవీరే రోజుల్లో, పూనా పరిసరాల్లో తన జీవనం కొనసాగింది. తన యుద్ధం ప్రజల్ని మూర్ఖుల్ని, అమాయకుల్ని చేసి దోచుకునే వ్యవస్థ మీద. అందుకే తనకు అనేక బ్రాహ్మణ మిత్రులుండి, తన పనులు సాయపడేవారు. ఆ దోపిడీ ఈ రోజుకీ మరో రూపంలో కొనసాగుతూనే ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|