|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
'రైతన్నలారా... మీరు గుండె చెదురద్దు. మీకు నేనున్నాను...' గొంతు చించుకుని అరుస్తున్నాడు ఎమ్మెల్యే. పద్మకు కోపం ఆగలేదు. స్టేజి ముందుకు నడిచింది. ఎవలో ఆపాలని ప్రయత్నించారు. ఎమ్మెల్యే వద్దని సైగ చేసి 'నీ బాధలేంటో చెప్పమ్మా' అన్నాడు లౌక్యంగా. పద్మ భయం లేకుండా మైకు అందుకుంది. 'అయ్యా... నేనున్నా... నేనున్నా అంటున్నవు. నువ్వు ఉన్నవో లెవ్వో నాకు తెలువదిగని మేమున్నమని గుర్తించు. రైతన్నలే గాదు. వాళ్ళతో రైతక్కలు గూడా ఉన్నారు. అదొక్కటి యాదికుంచు... ఆవేశంగా అన్నది. తర్వాత ఏం మాట్లాడాలో తెలువలేదు.
మైకును పక్కన బెట్టికిందకు వచ్చింది పద్మ. అప్పటికే చప్పట్లు మారు మొగుతున్నయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|