|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
సంఖ్యనే బలంగా భావిస్తే మరో ప్రమాదమూ పొంచి ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీగా బలం ఏమీ లేదు. తమకు డిస్టింక్షన్ రాలేదు పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని రాజశేఖరరెడ్డి పలుమార్లు స్వయంగా చెప్పిన విషయం గమనార్హం. 294 మంది శాసనసభ్యులున్న సభలో కాంగ్రెస్ పార్టీకి 155 మంది సభ్యుల బలమే ఉంది. తెలుగుదేశం పార్టీకి 95 స్థానాలు ఉన్నాయి. ప్రజారాజ్యానికి 18 స్థానాలు ఉన్నాయి. టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ సహజంగానే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. దాదాపు పదిమంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం ఆకర్షించగలిగితే కాంగ్రెస్ అధికార పీఠం తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ పరిస్థితిని నివారించే సమర్ధుడై ఉండాలి.
క్యాబినెట్ లో చోటు దక్కని జానారెడ్డి, జేసి దివాకర్ రెడ్డి, ఓటమి చెందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి (జనార్ధన్ రెడ్డి), డి.శ్రీనివాస్ లాంటి వారు తన తండ్రి మరణానికి పరోక్షంగా రాజశేఖరరెడ్డే ప్రధాన కారణమని నమ్మే దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి కుమారుడు, జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తారని అనుకోవడానికి వీలులేదు. ఏ క్షణమైనా ఏ మూల నుంచైనా ఉపద్రవం ముంచుకు రావచ్చు. ఈ ఉపద్రవాన్ని నివారించగల ఉపాయాన్ని ఢిల్లీ అధిష్టానం కనిపెట్టకపోతే రాష్ట్రంలో ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల రెండువందల యాభై రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టం కావచ్చు.
అధికారం రుచి, రంగు, వాసనలు తెలిసిన చంద్రబాబు అవతల ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోని తమాషా ఆటలను చూస్తూ ఊరికే ఏమీ కూర్చోరు. రాజకీయాలలో ఆరితేరిన ఆయన కాంగ్రస్ పార్టీ ప్రభుత్వ అస్థిరత్వానికి కావాల్సిన అన్ని వ్యూహాలూ అమలు పరుస్తూనే ఉంటారు. ఆయన సామాజిక వర్గల పెద్దల సూచనలు, సమీకరణలు ఆయనను తప్పక ప్రభావితం చేస్తాయి. ఇలా ఎన్నో సమీకరణలు రాజ్యాధికార పీఠాన్ని ప్రభావితం చేస్తాయి. బయి జనాల నుంచి ఎంత మద్దతు ఉన్నా సంఖ్యా బలంతో పీఠంపై కూర్చోబెట్టినా కూర్చున్న నాయకుడి లోపల సామర్థ్యాలు లేకపోతే పీఠాన్ని నిలుపుకోవడం కష్టమౌతుంది.
'సంతాప దినాలు ముగిసే వరకు ఎవరూ ఏమీ మాట్లాడవద్దు' ఆ తర్వాత సిఎల్పీ సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది అప్పటిదాకా రోశయ్యే ముఖ్యమంత్రిగా పనిచేస్తారని ఏఐసిసి దిగ్గజం దిగ్విజయ్ సింగ్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి చెప్పారు. అలా ఆయన జగన్మోహన్ రెడ్డి సమర్థకులకు అడ్డుకట్టవేశారు. ఏది ఏమైనా కొత్త ముఖ్యమంత్రిని నియమించడంలో ఏఐసిసి ఆచీ తూచీ అడుగులు వేయాలి. ఈ విషయంలో వారి నిర్ణయం పొరపాటు అయితే ఆ పార్టీకి అది అశనిపాతం కావచ్చు. లేకపోతే భవిష్యత్ ఎన్నికలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టవచ్చు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|