|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
పైన పేర్కొన్న దశలు తెలుగు సీమలో ప్రతిఫలించినా శిష్టవర్గం లేదా ధనికవర్గం అందులో ప్రవేశించి ఆ ఉద్యమాలను నీరుగార్చింది. కమ్యూనిస్టు పార్టీల్లో కూడా వారి భావజాలం ప్రభావం అధికం. ఇక్కడ శిష్టవర్గాలు, ధనికవర్గాలు కలిసిపోతాయి. హాయిగా చెట్టాపట్టాల్ వేసుకుంటాయి. ప్రగతిశీలమే ప్రణాళికగా ఉన్నా అంతిమంగా ప్రజల స్వామ్యాన్ని కొంతమేరకే అంగీకరించడం జరిగింది. ఉద్యమ నాయక్వంలో ప్రజలకు సముచిత స్థానం లేదు. సాంస్కృతిక రంగం చాలా పురోభివృద్ది చెందినట్లు అనిపించినా అంతిమంగా అది ఉన్నత కులాలకి ఊడిగం చేసేట్లుగా తయారు చేశారు.
ముఖ్యంగా వర్గ దృక్పథంతో పోరాటాలు చేసిన వారు మార్క్స్, మావోల సిద్ధాంతాలను సాంస్కృతిక రంగానికి అన్వయించడంలో విఫలమయ్యారు. కళలూ సారస్వతం ఎవరి కోసం అన్న ప్రశ్నను గ్రహించారే తప్ప ఈ పద్ధతిలో, ఈ రీతిలో ప్రజలకు అందించవచ్చని అన్వయించడంలో విఫలమయ్యారు. ఇందుకు కారణం ఉన్నత కుల అహంభావమే. ఈ ధోరణి వల్ల గత డెబ్బై ఏళ్ళ ప్రగతిశీల ఉద్యమాలు, భాషని ప్రజాస్వామీకరించలేదు. ప్రజలు తెలుగుని తమదిగా భావించలేదు.
వ్యావహారిక భాషోద్యమం వచ్చినా అది వ్యక్తులకే పరిమితమైంది. గ్రాంధిక (పవిత్ర) భాషని ప్రశ్నించడం దానితో పోరాడి, ఒక కొత్త పత్రిక, ప్రచార అచ్చు భాష కోసం ఉద్యమం జరిగింది. ఈ భాషోద్యమంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనలేదు. వారు అందులో తాదాత్మ్యం చెందలేదు. తాదాత్మ్యం చెందిన కమ్యూనిస్టు ఉద్యమాలు వారిని నడమంత్రంగా వదిలిపెట్టినట్లు భావించారు. అందుకే తమిళనాడులో బ్రాహ్మణేతర ఉద్యమాల ప్రభావం ప్రజలపై పడినట్లుగా ఇక్కడ సాధ్యం కాలేదు. అలా సాధ్యం అయితే భాషలో దాని ప్రతిఫలాలు కనిపించేవి. అందువల్ల తెలుగు భాషీయులం అని పైన పేర్కొన్న సమూహాలు చెప్పుకోవడానికి పెద్దగా ముందుకు రావడంలేదు. అందుకే జనసమూహాలు తాము తెలుగు భాషీయులమని, తమ తల్లి భాష తెలుగని చెప్పుకోవడానికి సుముఖంగా లేరు.
పైగా ఇంగ్లీషులో చదువకోవడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప తెలుగుని ఆత్మీయంగా హత్తుకోలేకపోతున్నారు. అందుకు శిష్ట బ్రాహ్మణ వర్గ దృక్పథమే ప్రధాన కారణం. ఈ దృక్పథమే బ్రాహ్మణేతర భాషని శిష్టేతర భాష పేరు పెట్టి ప్రామాణికత లేదని తిరస్కరించడం జరుగుతోంది. దానివల్ల తెలుగు జాతీయత అన్న భావనకు పెద్ద గండి పడింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|