|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
'గా గౌడిబర్లను సూడవోయిన... అయినోని వేషం పాలోనిదైనట్టున్నయి అనుకుంట... మెల్లగనే వత్తున్నా... జర్రున జారా... పిడాత పడా...' వచ్చినోల్లందరికి మొసపోసుకుంట చెప్తంది లస్మవ్వ.
డాక్టరిచ్చిన నిద్రగోలీలేసింది సుజాత.
నిద్రల్నే జెనికినట్టవుకుంట... ఏదేదో కలవరిత్తంది.
'ఎనుగర్రకు కట్టిన బాసింగం... ఎవడో ఇడుసుక పోతుండ్రా... పట్టుకోండ్రి' అనుకుంట
రాజేశంకు ఎవలో చెప్పంగనే చాకలి లింగన్ని తీసుకొచ్చి కల్లుతోని మొకం కడిగిచ్చిండు. మంచం మీదికెల్లి కోడిగుడ్డు తింపి పారేసిండ్రు...
లస్మవ్వ నిద్రబోయింది.
మబ్బుల్నే...'రాయేషా... ఓరి రాయేశం' అని పిలిసింది.
'ఏందే అవ్వా... నీ పక్కనే పండుకున్నం' అన్నడు కొడుకు.
'బర్రెకు గడ్డేసి... పాలు పిండి బిడ్డా... కుక్కలు మొరుగదిక్క... బెదిరితె పాలియ్యది... ఇయ్యాల నా నడుం లేసెటట్టులేదు. వాడుకాలు పోసిరా కొడుకా...' అన్నది. రాజేశం లేసిండు... పాలు పిండి సీసాల్లల్ల పోసి సైకిలేసుకుని పోయిండు. సుజాతని పిల్చి 'లగ్గమైన కొత్తల చిలాకోడూర్ జాతర్ల... మీ మామతోని దిగిన ఫోటువ పసందుగులున్నది బిడ్డా. తీసుకచ్చి ఎదురుంగ దిగూట్లె పెట్టు.... నన్ను కూడా జెల్ది కొంటవొమ్మని రోజూ మీ మామకు మొక్కుత...' అన్నది.
సుజాత అటుకు మీది సందుగు తీసి... ఫోటో తుడిచి గుట్లె పెట్టింది. వారం పదిరోజులు గడిచినయ్... లస్మవ్వ కూరపేగోలె ఇంకింత ఇగ్గుకచ్చింది.
'సుజవ్వా... సుజవ్వా...' అని పిల్సుకుంట బర్రె గురించి జాగర్తలు చెప్పింది.
'పెండ తీసెటప్పుడు సూడు బిడ్డా... పెండల తీగెలు, రక్తపు జీరలుంటె దానికి పానం బాగాలేనట్టు...' అన్నది.
ఓ రోజు కోటవ్వ వచ్చింది.
'వాడుకాలు సగం బందయినయే లస్మవ్వా... కిష్టరెడ్డి పటేలు పాలల్ల వెన్నదీసే మిషిన్ దెచ్చిండట... బెండు బెండు లెక్కున్నా మొత్తం ఆయనకే వాడకాలు పెరిగినయ్' అని చెప్పుకుంట బాధపడ్డది.
'కవ్వమాడిన ఇంట్ల కరవుండదంటరు... ఎన్నకు కూడా మిషిన్లచ్చినాయె' నడుం బాధ ఓర్సుకుంట అన్నది లస్మవ్వ.
'ఇంకో బర్రె ఈనింది. పెయ్యదూడనే గని వాడుకాలు లేకపాయె' అన్నది కోటమ్మ.
'మాయి పడ్డదానె... జున్నుపాలు పోశమ్మకు పెట్టచ్చినంక... దూడబొక్కుకే పట్టియ్యాలె. పెయ్యదూడకు ఉప్పు తవుడు రాయి. బిడ్డను తల్లి నాకాలె...' అన్నది.
సుజాత అన్నం కూర కలిపి తెచ్చింది. ఎంత బతిమిలాడినా లస్మవ్వ తిన్లే...
'కడుపుల లోపుతుంది బిడ్డా' అన్నది.
'అన్నం ఉగ్గపడుతున్నావే ముసల్దానా... మంచంల్నే ఎత్తిపోసుడైతది అనుకుంటున్నావా...' అని గద్రాయించింది కోటమ్మ.
లస్మవ్వ కండ్లల్ల నీళ్ళు తిరిగినయ్.
పొగవట్టిన వాసాల దిక్కే చూసుకుంట జెల్ది కొంచవొమ్మని దేవునికి దండం పెట్టింది.
'తిను అత్తా... జెప్పన జారుతదని కొంచెం పచ్చిపులుసు కలిపిన' అని నోట్లె రెండు ముద్దలు పెట్టింది... కొంచెం కూసోపెట్టి నీల్లు తాగిచ్చింది.
కోటమ్మ వెళ్ళిపోయింది.
ఇట్ల మూడు నెలలు గడిచినయ్... ఇల్లంత బెక్కొట్టినట్లయింది. వీపుకి పుండ్లయి పెయ్యంత ఒదులకిచ్చింది... లస్మవ్వ ఎముకల గూడే అయింది.
'సుజవ్వా... బర్రె నెమరేత్తుందా బిడ్డా... దానికి పానం మంచిగ లేకపోతే ఒక్కోసారి కండ్లల్ల బుసులత్తయ్... నీల్లు కారుతయ్... చెవులు కిందికి యాల్లాడేత్తది... తోలు మందమై ఎంట్రుకలు బుగ్గరిచ్చినట్టు లేత్తయ్... పాల జ్వరాలత్తయ్ బిడ్డా.... దానికి మన పుటుకు లెక్కనే... నోరు వాయి లేని పసురమాయె.. పాలు మంచిగ ఇత్తుందా బిడ్డా...' అనడిగింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|