|
|
Articles: Short Stories | తెలుగు పెర - Site Administrator
| |
లోకల్ యంఎల్ఏ రావటం ఆలస్యమైనందున మీటింగ్ ఆలస్యమైంది. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడని ఒకటే టెన్షన్. ఏటిండికి వచ్చి, అర్జంట్ ప్రోగ్రాం ఉందంటూ, వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు. చాంతాడు లాంటి ఉపన్యాసకుల లిస్టులో సతీష్ కొదవవాడిగా వేదికెక్కాడు. పంచెకట్టి, కండువా వేసుకుని వచ్చినందుకు ఆశ్చర్యపడినా, ఏం చెపుతాడోనని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూచారు.
'నేను పుట్టుకతో తెలుగువాడిని. తెలుగుతల్లి స్థన్యం తాగి, ఇక్కడే తెలుగుతల్లి గుండెలమీద దోగాడి, ఇరువది రెండు సంవత్సరాలు ఇక్కడి పరిమళాలు పీల్చి, పెరిగిన వాడిని. గుడివాడలో ఉన్న నా తల్లి తండ్రి రామసుబ్బయ్య నా అడగడుగు సరిదిద్దితే - చదివిన చదువుకి సరైన ఉద్యోగం దొరక్క అమెరికా ఎగిరిపోయాను. అక్కడ ఉంటున్నాను గనుక ఇంగ్లీషు బాగానే మాట్లాడగలను. కానీ తెలుగే నా తల్లిభాష. దాన్లో మాట్లాడి నా తల్లి రుణం కొంత తీర్చుకుంటుంటున్నాను.
నేడు తెలుగుదేశం పాఠశాల నిండా మాతృభాషకై కత్తిగట్టినట్లు తెలుగు సబ్జక్టు లేకుండా కళ్ళు మూసుకుని నడుస్తుంటే మేడంగారు ఒకటో తరగతి నుండి పదో తరగతి దాకా తెలుగును ఉంచినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమెరికా సిటిజన్స్ ఏ చిన్న పని చేయటానికైనా సిగ్గుపడరు. ఇక్కడ్నుంచి అక్కడ చదువుకోవటానికి వచ్చే విద్యార్థులు కూడా విరామ సమయాల్లో హోటళ్ళలో సర్వర్లుగా, పెట్రోల్ బంక్ లో సేల్స్ మన్లుగా పనిచేస్తారు. తమ తమ సామాన్లు తామే మోసుకుంటారు. ఎవడూ నామోషిగా భావింపడు.
మరి ఇక్కడ? 4, 5 తరగతుల నుండే విద్యరానివాడు వింత పశువైతే వచ్చినవాడు ఏ పశువు? సంత పశువా? కట్నాల వేలం పాటలో బరితెగించి నిలబడే పశువా? ఒక్క విన్నపం - పొలాల్లో, కార్ఖానాల్లో ఎక్కడబడితే అక్కడ ఎండకు ఎండిపోతూ, వానకు తడ్సిపోతూ సర్వసంపదలు సృటించి పెంచే శ్రమజీవులా పశువులు? వాళ్ళని పశువుల్లా మార్చిందెవరు? మనం కదూ?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|