|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
వైద్యులకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించేటప్పుడు న్యాయస్థానాలు సాధారణంగా రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటాయి. :
1. న్యాయమూర్తులు వైద్యశాస్త్రంలో నిపుణులు కారు. కాబట్టి వారు ఇతర వైద్యుల సాక్ష్యం మీద ఆధారపడవలసి ఉంటుంది. ఆ వైద్యులు కూడా ఇతర వృత్తుల వారిలానే వారివారి వృత్తిదారుల్ని రక్షించుకోవడానికి సాధారణంగా అనుకూల సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ సాక్ష్యం కూడా ఇతర వృత్తుల వారికి, ముఖ్యంగా న్యాయమూర్తులకు అర్థమయ్యేటట్టు ఉండదు.
2. వైద్యులు అజాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పకుండా శిక్షించాల్సిందే. అలా అని వాళ్ళు కూడా ఇతరుల్లా తప్పులు చేస్తారన్న విషయాన్ని మరచిపోకూడదు. వాళ్ళు చేసే ప్రతి తప్పుకీ శిక్షపడుతుందన్న భయంతో వాళ్ళు పనిచేస్తే, వాళ్ళసలు పనిచేయలేరు. భయంతో ఏ వృత్తిదారుడూ తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేడు.
న్యాయం, వైద్యశాస్త్రాలు - రెండూ ఖచ్చితమైన శాస్త్రాలు కావు. కేసుకు సంబంధించిన పరిస్థితులు, తీర్పు చెప్పే న్యాయమూర్తుల వ్యక్తిగత ఆలోచనల మీద ఆధారపడి ఫలితం ఉంటుంది. అలాగే వైద్యశాస్త్రంలో కూడా రోగి మానసిక, శారీరక స్థితి, వైద్యుడి మానసిక, శారీరక స్థితితో కలిసి నిర్ణయం చేసే పద్ధతి, రోగి మీద చూపే ప్రభావంపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక వృత్తి చేసే వ్యక్తి అజాగ్రత్తగా ప్రవర్తించాడా లేదా అన్నప్పుడు అతను తగినంత సామాన్య జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా అని చూడాలే తప్ప నిర్దుష్టంగా చేసాడా లేదా అన్నది కాదు. ఆ నైపుణ్యం కూడా రోగిని పరీక్షించే నాటికున్న పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటారు. కాని విచారణ సమయంలో ఉన్న పరిస్థితుల్ని కాదు. ఒక్కోసారి ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్న పరిస్థుతుల్లో వైద్యుడు ఉండాల్సి రావచ్చు. అప్పుడు ఏది తక్కువ నష్టమో చూడాలి తప్ప, అసలు నష్టమే రాకూడదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒక్కోసారి ఎంతో పేరున్న వైద్యుడు శాస్త్ర పురోగతి కోసం ప్రయోగం చేయవచ్చు. అది వికటించే ప్రమాదముంది. అటువంటప్పుడు వైద్యుడ్ని తప్పు పట్టకూడదు. కాని అటువంటి పరిస్థితుల్లో రోగికి పూర్తి సమాచారాన్ని ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది.
పై అంశాల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు అనేక కేసుల్లో తీర్పులిచ్చాయి. అత్యవసర పరిస్థితిలో రోగిని తీసుకువచ్చినప్పుడు అతనికి వైద్య సహాయం చేయవలసిన బాధ్యత వైద్యుడి పై ఉందని తీర్పునిచ్చింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|