|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
అనువాద యుగము :
ఆది అనువాదకుడు నన్నయ (11 - డో నూరేడు 0 నుండి అనువాద సార్వబవుముడు శ్రీనాదుని (15-నో నూరేడు) వరకు తెలుగు నానుడి అనువాదాలతో మొదలుపెట్టి అనువాదాలతోనే పెరిగి, పెంపొందింది. ఈ అనువాదాలు ఎక్కువగా సంస్కృతము నుండి జరిగినాయి. ఏ కారణము చేతనో ఈ యుగములో మవులిక రచనలకు అండ లబించలేదు. ఆనిడిగా (independently) రచింప పూనిన వారిని (అది చాలా కొద్దిగానే అనుకోండి) ఆ నాటి లోకము ఆదరించలేదు, అవమానించింది, కానవాలించింది, నాలించింది, తొక్కి ఏసింది. ఈ యుగములోని అనువాదకులు తాము సంస్కృతములో నుండి తెలుగులోనికి అనువాదము చేస్తూ ఉన్నాము అన్నారా? ఆంద్రము లోనికి రచిస్తున్నాము అన్నారా? అనే సంగతులను ఇప్పుడు చర్చిద్దాము.
(అ) ఆది అనువాదకుడు నన్నయ్య (క్రీ.త.1022-1063) :
రారాజు కోరింది :
'జననుత కృష్ణద్వైపాయన
ముని వృషబాబిహిత మహాబారత:బ
ద్ద నిరూపితార్దమేర్పడ
దెనుగున రచియింపు మదిక దీయుక్తి మెయిన్'
నన్నయ నిర్ణయము :
'సారమతింగవీంద్రులు ప్రసన్న కవితార్ద యుక్తితో
నారసి మేలునానితరులక్షరరమ్యతనాదరింపనా
నారుచిరార్ద సూక్తి నిది నన్నయబట్టు తెలుంగునన్మహా
బారత సంహితా రచన బందురుడయ్యె జగద్దితంబుగన్'
అంటూ, నన్నయ చేసిన పని :
'పంచమ వేదంబగు బారతంబును తెనిగింప
గంటిని, దన్యుడనయితిని అని ఎంచి...'
దీనిని పట్టి మనకు తెలియగలది ఏమి? నన్నయ నాటికి మంది పలుకు తెనుగు, తెలుంగు అనే రెండు రూపాలు కలిగి ఉండింది అని తెలుస్తుంది. అంతేకాదు, అది ఆ నాటికే తెనిగించు తెలిగించు అనే చేత (verb) రూపాలను కూడా సంతరించుకొని ఉండిన అట్టు తెలుస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|