|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
నన్నయ రచనలో ఆంద్ర అనే మాట లేదు. 'ఆంద్ర శబ్ద చింతామణి' నన్నయ రాసింది కాదు అని ఇప్పుడు అందరూ అంగీకరించినారు. దానిని నన్నయే రాసినాడు అనుకొన్నా, దానిలో ఆంద్ర అనే మాట సమాస రూపములోనే ఉన్నది అని మనము గుర్తించుకోవాలి. పయిగా 'ఆంద్రశబ్ద చింతామణి' నన్నయ రాసినాడు అని చెప్పిన అప్పకవి (కీ.త.17-నూరేడు) కూడా చెప్పింది :
'ఆంద్ర శబ్ద చింతామణి వ్యాకరణము
ముందు రచించి తత్సూత్రముల దెనుంగు
బాసచే జెప్పె నన్నయబట్టు తొల్లి
పర్వములు మూడు శ్రీమహాబారతమున'
-------------------
'బారతము దెనిగించుచు దా రచించి
నట్టి రాగపాండవీయము నడంచె'
నన్నయ నాటి నానుడి సాగు తెనిగింపు. రారాజు కోరింది తెనుగున రాయమని, నన్నయ రాసింది తెనుగు. ఆ నాటికే దానికి తెనిగించు అనే చేత రూపము కూడా ఉంది. ఆ చేత రూపాన్నే అప్పకవి ఆరు నూరేళ్ళ తరువాత అదే పొత్తులో వాడడము గమనింపతగిన అది. నన్నియబట్టు (ఏ నన్నియబట్టో ఇదమిత్తంగా తెలియదు) రాసిన అట్టు ఉండే రాజరాజదేవు (రాజరాజ నరేంద్రుడు?)ని నందంపూడి చెక్కింపులో నారాయణబట్టును గురించి 'య: సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంద్ర బాషా సుకవి రాజశేకర' అని ఉంది. అంటే ఆ నుడులలో నారాయణబట్టు కవి అయి ఉండ ఒచ్చు. కాని దానిలో ఆంద్ర బాష అంటే తెలుగు అని ఎక్కడా లేదు. కర్నాట బాష అంటే కూడా తెలుగు అని శ్రీనాదుని, పోతన ఊసులు (references) ఉన్నాయి. చెక్కింపులలోని ఆంద్ర బాష అనేది నారాయణబట్టు రాసిన దానికి చెందుతుంది, కాని నన్నయకు కాదు. నన్నయ రాసింది తెనుగు, చేసిన పని తెనిగించడము.
ఇక్కడ మరి ఒక సంగతి కూడా మనము గురుతు ఉంచుకోవాలి. నన్నయ తెనిగించింది మహాబారతము. కాని అది మెల్ల మెల్లగా మారి నేటికి ఆంద్ర మహాబారతము అయింది. ఇదే చూపుతుంది తెలుగు నానుడిలో రచనలు సాగిన వయినము. ఏమీ? తెలుగు మహాబారతము అనకూడదా?
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|