|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
మొత్తం మీద ప్రోటోనార్త్ ద్రవిడియన్, ప్రోటో సెంట్రల్ ద్రవిడియన్ భాషలు సమాంతరంగా వర్ధిల్లి ఉంటాయని, బ్రాహుయూకి ఇంచుమించుగా సమాన కాలంలో తెలుగు విడివడి ఉంటుందని, ఆ ప్రాచీన (ప్రోటో) తెలుగు ప్రజలకు సింధు నగరాలతో పరిచయం ఉండే అవకాశం ఉందనీ, డెక్కన్ లో ఆర్యులకు సంబంధిత ప్రభావాలు దొరకడం కూడా ప్రోటో తెలుగు, ఇండో ఆర్యన్లకు గల సంబంధాలకు సాక్ష్యం అనీ గట్టిగా చెప్పవచ్చు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తొలుత బ్రాహుయీ తర్వాత విడివడిన మొదటి భాష తెలుగేనని స్పష్టంగా చెప్పారు!
ఋగ్వేదంలో ద్రావిడ పదాలు :
Posshl అనే చారిత్రక వేత్త 1996లో లెక్కించిన ప్రకారం సింధు నాగరికతలో దొరికిన వ్రాతని 50 మందికి పైగానే పరిశోధనలు రకరకాలుగా చదివేందుకు ప్రయత్నించారు. కొందరు అది ఆర్యుల భాష అన్నారు. కొందరు ద్రవిడుల భాష అన్నారు. తమిళులైతే అది తమిళ భాషేనన్నారు. ఐరావతం మహదేవన్ అందులో తెలుగు పదాలు కూడా ఉండవచ్చునంటూ బాణం గుర్తు ఉన్న పదాలు 'ంబు' (ఉదా|| వివాహంబు, కార్యంబు)తో ముగిసే తెలుగు పదాలు కావచ్చునన్నాడు.
1996 తర్వాత ఈ పదాలను మరో 10-15 మంది తమదైన తీరులో విశ్లేషించి ఉండవచ్చు. కొత్త ఆలోచనల్ని జోడించి ఉండవచ్చు. మైకేల్ విజ్జల్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్ దృక్పథంతోనూ, డేవిడ్ ఫ్రాలీ లాంటి వాళ్ళు రైటిస్ట్ దృక్పథంతోనూ ఈ దేశ ప్రాచీన చరిత్రని విశ్లేషించేందుకు పూనుకున్న పాశ్చాత్య ప్రముఖులు.
వేదాలలో కన్పించే భాషని 'పాత ఇండో ఆర్యన్ భాష (Old Indo Aryan = OIA) అని పిలిచాడు మైకేల్ విజ్జల్. ఈ OIA భాష క్రీ.పూ. 1500 కన్నా పూర్వం పంజాబ్ సింధు (గ్రేటర్ పంజాబ్)లో వ్యాప్తిలో ఉన్న భాష కావచ్చు. క్వీపర్ అనే పరిశోధకుడు మయూర, గజ లాంటి గట్టి సంస్కృత పదాలు సంస్కృత భాషలోకి చేరిన పరాయి భాషా పదాలు - (అరువు పదాలు (Loan words) అని నిరూపించిన తర్వాత ఋగ్వేదంలో అరువు పదాల అన్వేషణ విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికి దాదాపు 700 పదాలు తేలినట్లు మైకేల్ విజ్జల్ పేర్కొన్నాడు.
అక్కల్ (anguish), అంబు (a water plantup), మరుత్ (eagle), కక (Backside of Head), లల(frontside of Head=లలాటం), తంద్ర (Lazy), బధిర (Deaf), మంగళ (auspicious), మను (Fertile land), మరీచి (beam of light), ముఖ (Mouth, Head), ముసల (Pestle), మూల (Root), వరి (Rice), గోధుమ (Wheat), సీత (Farrow), సిరి (Weaver), ఇలా చాలా పదాలు ఉదాహరణగా చెప్పవచ్చు. వీటిలో కొన్ని ద్రవిడ పదాలు, కొన్ని ముండా భాషా పదాలు, కొన్ని ఇతర భాషా పదాలు ఉన్నాయని విజ్జల్ పేర్కొన్నాడు. మన్ను మాన్యం తెలుగు పదాలకీ, 'మను' వైదిక పదానికి సంబంధం ఉందేమో ఆలోచించాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|