|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
శే:- ఏం చెయ్యమంటావో చెప్పరా మరి? నా అయిదు రూపాయలూ నాకిచ్చేయ్యి. లేదూ- నాకో ప్రియురాల్ని కుదిర్చి పెట్టి, ప్రేమ చిట్కాలు నేర్పు.
సుం:- ఏడ్చినట్లుంది! నేనేమైనా 'మురళీ' రాసిన 'ప్రేమించి పెళ్లి చేసుకో!' నాటికలో కవి పాత్ర వేశాననుకున్నావా?!
శే:- అయితే నా డబ్బు నాకిచ్చెయ్యి.
సుం:- అయిదు రూపాయలకీ అయిదుగురు అమ్మాయిల లిస్టు ఇచ్చేశానుగా?
శే:- విమలకీ నాకూ పెళ్లయేలా చూడు .లేకుంటే, నేనిక్కడ్నించి కదలను.
సుం:- అయితే ఒక చిట్కా చెబుతాను. విను. ఆ అమ్మాయిని సుబ్బారావు నించి తప్పించి నీవేపు తిప్పుకోవాలంటే, నాటకాలాడ్డం నేర్చుకో! పెద్ద హీరోవైపో!
{LIGHTS OFF AND ON!}
[ ఇప్పుడు గది నీటుగా సర్ది ఉంటుంది. ప్రకాశం - సుందరం చెరో మూలా కూచుని దీక్షగా .. శ్రద్ధగా.. బుద్ధిగా- చదువు కుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతునంట్టున్నాయి.]
(ఏడు కొండలు ఎమ్.బి లోంచి ప్రవేశించి)
ఏ:- ఏంటి గురూ ! మీరిద్దరూ ఇంత బుద్ధి మంతులైపోనారేటి? ఇదెప్పట్నించి?
ప్ర:- ఇవాల్టినించే!
సుం:- కాదు. ఈ క్షణం నించే!!
ఏ:- తస్సదియ్య మీరిద్దరూ ఇంత బుద్ధిమంతులైపోతే, మరి నా పేమ మాటేటీ? ఇక నా వందనం మాటేటీ?
(ప్రకాశం చిటికేసి ఏడుకొండల్ని దగ్గరకు పిలిచి - SILENCE! DON'T DISTURB !',అన్న బోర్డు చూపిస్తాడు.)
ఏ:- (చదువు తాడు) 'సైలెన్సు! డోంట్ డిట్టర్బ్!',మిమ్మల్ని డిట్టర్బ్ సెయ్యడానికి నాకు తీరికుందేటి? నా రూమ్ లో పేసు పౌడరైపోనాది. కూసింత పేసు పౌడరెట్టినావంటే, ఎల్లి పోతాను.
సుం:- ఫేసుపౌడరు దేనికి?
ఏ:- వందనం ఈ రేతిరి సినిమాకెడదారి రమ్మంది. సక్కగా మేమిద్దరం సినిమా సూసు కుంటూ పేమించుకుంటాం!
ప్ర:- ఏవిటీ? వందనం నిన్ను ప్రేమించేసిందా?
సుం:- పెళ్లి చేసుకుంటానందా?
ఏ:- ఈ ఏడు కొండలంటే ఏటనుకున్నావేటి? నువ్వు రాసిన పేమలేకలు బట్వాడా సేస్తే , పెల్లి కాక మరేటవుద్దేటి?!
సుం:- అయ్య బాబోయ్! ఏడు కొండలుకి గ్రీన్ సిగ్నల్!
ఏ:- ఏం సేత్తాం? ఏడవగ్గురూ! లక్కుంటే నీకూ తాయారు దక్కుద్ది.
ప్ర:- నా తాయారును వాడి కంట గడతానన్నా వంటే తంతాను.
సుం:- ఆహాఁ!? ప్రేమించకుండానే, పెళ్లి చేసుకోకుండానే, తాయారు వాడిదైపోతుందేం?!
ఏ:- మీ దెబ్బలాటలింటానికి నాకు తీరిక లేదు. ముందు వందనం దగ్గరకెలాలి. నేనెల్లినాక మీరు తీరిగ్గా దెబ్బ లాడుకోండి.
(ఏడుకొండలు చేతిలో పౌడరు పోసుకుని బయటకు వెడుతుంటాడు.అతనికి శేషావతారం ఎదురొస్తాడు.)
శే:- ఏంట్రాసుందరం?! వాడల్లా మజాగా పోతున్నాడు?
సుం:- (బాధగా) వాడికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది!
ప్ర:- నా ఖర్మ!
శే:- నీకు ఖర్మేంట్రా? చక్కని తాయారుందగా.
సుం:- ఒరే! నా తాయారును వాడి పక్కనుంచితే తంతాను.
ప్ర:- మరే! పాపం! తాయారు వాడిదీ?! మొహంచూడు!
సుం:- ఏం? నా మొహానికేమొచ్చింది? నా పేరు సుందరం! నా మోమంతకన్నా సుందరం!!
శే:- ఒరే! నేనిప్పుడు మీ కీచులాట విండానికి రాలేదు. ఇదిగో- ఇది చూడు ఇన్విటేషన్!
(ఇద్దరికీ చెరోటీ ఇస్తాడు.)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|