|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
ఆ కవి గారంటే నాకు ఇష్టం. ఆయన కవిత్వం బాగా ఇష్టం. కానీ ఆ పొద్దు ఆయన మాట్లాడిన మాటలు నన్ను నొప్పించినాయి. ఆయనకు పూసలవాళ్ల గురించి ఎంత తెలుసుంటుంది? నేననుకోవడం ఆయన దోవనపోతూ వాళ్లు మాట్లాడుకొనే మాటలను వింటూ ఉంటారేమో. అంతే అయుంటుంది. అంతకు మించి తెలుసుంటుందనుకోను.
హైదరాబాదులో పూసలవాళ్ళంటారే వాళ్లనే మిగిలిన ఆంధ్రదేశంలో చాలా చోట్ల నక్కలవాళ్లు అంటారు. కన్నడసీమలో హక్కిపిక్కీలనీ పార్థీలనీ అంటారు. హోసూరు ప్రాంతంలో శికారోళ్లు అనీ, మిగిలిన తమిళనేలన నరికొరవర్ అనీ పిలుస్తారు. దక్షిణ భారతమంతా పరుచుకొని ఉన్న వీళ్ల బాస పేరు వాఖడీ బోలీ. ఇది ఇండో ఆర్యన్ భాష. భారతదేశంలో చాలా చాలా వేగంగా కనుమరుగయిపోతున్న బాసలలో ఇదొకటి. పాతికేండ్ల క్రితం ఈ బాసలో ఉండిన చాలా మాటలు ఇప్పుడు లేవు. వీళ్లు సంచార కులం. ఇప్పుడిప్పుడే ఒక తావున కుదురుకొంటున్నారు.
ఏభై ఏండ్లప్పుడు వీళ్ల బాసలో పాటలుండేటివి. మానవ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి దక్షిణ భారతమంతా తిరిగితే కూడా ఇప్పుడు ఆ పాటలు దొరకడం లేదు. అంటే ఏబై ఏండ్ల క్రితపు పాట ఇప్పుడు లేదు. పాతికేండ్ల నాటి మాటలు చాలా ఇప్పుడు లేవు. ఇదంతా కూడా వీళ్లు బడికిపోని దశలోనే వచ్చిన మార్పు. ఇప్పుడిప్పుడు వీళ్ల పిల్లలు బడికి పోతున్నారు. బడిలో తెలుగో, కన్నడమో, తమిళమో లేకపోతే అందరికీ 'అన్నింటికీ తల్లయిన' ఆంగ్లమో వీటిల్లో ఏదో ఒకదానిని చెబుతారు. కానీ వాఖడీ బోలీని చెప్పరు కదా. కాబట్టి ఆ బాస కనుమరుగవడం ఇంకా వేగమవుతుంది.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|