|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
'తేవెతేవే యిటుతేవే
పచ్చడి తిననోళ్ళా - పల్లురాల గొడతాను
దొంగవేషాలేస్తన్నరు - దవడలు వాయించుతాను
తేయెతేయె యిటు తేవే - తన్నులు తింటారాళ్ళు
వీళ్ళ రాశిపలంలో నున్నది - సున్నాలు తన్నులూ
రండిరో బద్దిరిగాళ్ళు - బడిలో వేసేస్తాను మిమ్మల్ని
మేస్టర్ల చేత గుండగ - తన్ను తిందురుగాని
రాశిఫలాలలోన ఆదాయం 'సున్నా' నాకు -
అవమానం 'ఆరు' మీకు'
(పిల్లలు భయంగా ఇంట్లోకిచేరి, అరచేతబెట్టిన పచ్చడిని నాకి అయిష్టంగా పల్లిగలిస్తున్నారు)
మతి తప్పినట్టు పరధ్యానంగా వుందామె. పిల్లా అల్లుడూ రాలేదేంటబ్బా అని ఆలోచిస్తోంది. కాకివచ్చి అరుగుమీద నిలబడి ఒకటే గోల చేస్తుండగా దాన్ని అసుంటా అదిరి తోలింది. కాకి - తన తలనుతన్ని పక్కనున్న ఈత చెట్టెక్కింది. దూరంనుండి నక్కల ఊళలు వినబడుతున్నాయి.
పరాకుగా వున్నాడు రైతు. నడిప్పిల్లా అల్లుడూ అమెరికానుండి ముంబయిలో మొన్నటకి విమానం దిగినట్టు టెలిగ్రాం వచ్చింది. నిన్నటికి హైదరాబాద్ నుండి విశాఖపట్నంలో దిగినట్టు తంతి కబురొచ్చింది. ఈ పాటికి ఊరు చేరివుండాల...ఇంకా అడుపడరేంటీ... వీళ్ళు!
ఓరే సిన్నాడా, పెదబావ పేకాటలో వున్నాడు గావాల, పిలిచి తోడ్కొని పెద్దవీధిలోకి వెళ్ళి చూడండిరా... చినబావా అక్కా వాళ్ళ కారులో వస్తున్నారేంటో... '
ఇదే సందని తుర్రున వీధిలోకి పారిపోయారు పిల్లలందరూ. రైతు తన భార్యతో
ఆడదాన ఆడదాన - అరిసిలొండీయే బేగి
నడిప్పిల్లా అల్లుడూ - అల్లదిగో వస్తున్నరు
పిట్టులూ పిజ్జాలూ తిని - వాళ్ల నాలుకలు చెడివుంటాయి
పెసరపప్పు - బూరెలు వండీయే బేగిబేగి
మినపప్పు గారెలూ వండీయే తొందరగా
ఇంజనీర్డు ఫుడ్డు తినీతినీ - వాళ్ళ కడుపులు చెడిపోయుంటాయి
కలగూర పులుసొండవే - రొయ్యిల వేపుడు ఎట్టవే
పిండిసాకు ఉండలేవె - బొల్లం పొంగడాల్ చేసీయే
ఆమె : 'ఓస్సోసి - వుండవా? ఒక సిటం ఆగవా?
చోడిపిండి అట్టడుగుతది - సున్నుండలు అడుగుతాది పిల్ల
కజ్జిపుండలు చేసినాను - అవే కావాలంటాదది
నడిపీ కూతురు పైనా పేమ - మామీద లేదు నీకు
ఒస్సోస్సీ... వుండవయ్యా - వంటచేయ నియ్యవయ్య'
అతడు : 'చోడిపిండి తోపవండు - అల్లుడోడికి తినిపింతుము
నువ్వులు నూనాపోసి - బెల్లం ముక్క నంజుకుంటే మళ్ళ!'
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|