|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
విసుగేసి న్యూస్ ఛానల్ పెట్టింది సుమతి.
ఎక్కడో మారుమూల ఊళ్ళలో ఒక కులం అబ్బాయిని మరో కులం అమ్మాయి ఏదో అందని అబ్బాయిల కులం వాళ్ళందరూ అమ్మాయిల కులం వాళ్ళందరి మీదకీ పోట్లాటకెళ్ళారుట. దానిని ఒకే సీన్ చూపించిందే చూపించి, చెప్పిందే పది రకాలుగా చెప్పి ఆ వార్తని ఎంతవరకూ సాగదియ్యాలో అంతా సాగదీస్తున్నారు ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు.
ఇంకిది లాభం లేదని హిందీ ఛానల్ కి మార్చింది సుమతి. అయ్యబాబోయ్... ఇదేంటీ అమ్మాయి జాకెట్టే వేసుకోలేదు... మర్చిపోయిందా... అనుకుంటూ ఆశ్చర్యపడపోబోయి ఆగిపోయింది. ఎందుకంటే సుమతి మార్చిన చాలా హిందీ ఛానల్స్ లో ఆడవాళ్ళు అలాగే ఉన్నారు.
వెంటనే టీవీ కట్టేసింది సుమతి.
ఒక రకమైన సంస్కృతికి అలవాటు పడ్డ కళ్ళు మరో రకం సంస్కృతిని చూడలేకపోయాయి. మళ్ళీ విక్రమార్కుడి భేదాళుడి ప్రశ్నలా ఏం చెయ్యాలి అన్న ప్రశ్న సుమతి ముందుకొచ్చి నిలబడింది.
ఎదురుగా టీపాయ్ మీదున్న పేపర్ ని చేతిలోకి తీసుకుంది. మొదటి పేజీలోనే ఉన్న పెద్ద ప్రకటన సుమతిని ఆకర్షించింది. ఒక ఆధ్యాత్మిక గురువెవరో సిటీకి వచ్చిమూడు రోజులు ఉపన్యాసాలిస్తున్నారు. సుమతి ప్రశ్నకి బదులు దొరికినట్లైంది. ఆ సాయంత్రం శంకర్రావుని బలవంతంగా బయల్దేరదీసింది. తీరా వాళ్ళు అక్కడికి చేరేసరికి ఆ రోడ్డు చివరి నుంచే వాహనాలను ఆపేస్తున్నారు. జనాన్ని దాటుకుంటూ కాస్త ముందుకెళ్ళేసరికి ఎలాగైతేనేం ఎక్కడో మూలగా కాస్త నిలబడ్డానికి చోటు దొరికింది.
స్వామివారి ఉపన్యాసం మధ్యలో ఉంది. కనుక ఈ పవిత్రమైన మానవజన్మని వృథా చేసుకోకండి. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పితే పశుపక్ష్యాదులను మించిన ఈ మానవజన్మ మనకు వచ్చేదికాదు. దీనిని సద్వినియోగపరుచుకోండి. సమస్యలనేవి మానవజీవితంలో ఎత్తుపల్లాలు. మనందరినీ నడిపించే దివ్యశక్తి ఒకటుంది. మీరు మీ సమస్యలేమిటో మాతో చెపితే దానికి విరుగుడుగా తగిన పూజలూ, శాంతులూ చేయిస్తాం. మీ భవిష్యత్తంతా శోభాయమానంగా ఉంటుంది. ఆ పూజలన్నీ చేయించడానికి ఏయే పూజకి ఎవర్ని కలవాలో విపులంగా చెబుతున్నారా స్వామీజీ. ఆయన చెప్పడం పూర్తవగానే కూర్చున్నవాళ్ళంతా పూజలు చేయించుకునేందుకు ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు క్యూలు కట్టేశారు.
శంకర్రావుకిదంతా తమాషాగా అనిపించింది.
కూతురి పెళ్ళి సమస్యే ఉందనుకుంటే ఇక్కడ పూజ చేయిస్తే ఆ సమస్య తీరి పెళ్ళి కుదురుతుందా... కొడుకు చదువుకోవడం కోసం పూజచేయిస్తే వాళ్ళు కోరుకున్న చోట కొడుక్కి సీటు వస్తుందా... రాదు. మానవప్రయత్నం తప్పనిసరి. దానికి ఈ పూజలు ఏమైనా దోహదపడతాయేమో... అంతమంది జనాల నమ్మకాన్ని కొట్టిపడెయ్యలేకపోయాడు శంకర్రావు. ఎవరి నమ్మకం వారిది. తమకైతే ప్రస్తుతం సమస్యలేమీ లేవుకదా అనుకుంటూ ఆ జనసముద్రాన్ని తప్పించుకుంటూ ఇద్దరూ ఇంటికి చేరారు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|