|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
`సత్యమేవ జయతే' అనే మకుటం తన లేఖల్లో ప్రముఖంగా ఉండేది. సత్యానికి అత్యంత విలువనిచ్చేవాడు. మనిషి నిజాయితీగా లేకపోతే సంతోషంగా ఉండలేడని, అన్నింటికి నిజాయితీయే ఆధారమని బోధించాడు. అన్ని మతాలకి సత్యం గృహమని, ప్రజలు అబద్ధానికి, కపటానికి లోనుకావద్దని చెప్పాడు. జోతిరావు సత్యనిష్ఠతో తన పనులు చేసేనాటికి మహాత్మాగాంధీ ఇంకా పుట్టలేదు. అందుకే తర్వాత కాలంలో జోతిరావు కృషిని తెలుసుకొని ఆయన నిజమైన మహాత్ముడని కొనియాడాడు.
బైబిలు అందరూ చదవవచ్చు. ఖురాన్ చదవవచ్చు. కాని వేదాలు అందరికీ అందుబాటులో లేవు. బైబిల్, ఖురాన్ నమ్మేవారికి భయం లేదు. కాని వేదాలు నమ్మేవారికి భయమెందుకంటే వాటిలో లోపాలు బయటపడతాయని అనేవాడు. అలా అని తాను క్రిష్టియన్ మతంలోకి మారలేదు. మతాంతీకరణ నిరసించేవాడు.
వృత్తికీ మతానికి సంబంధం లేదన్నాడు. క్షురకర్మలు చేసేవాడు ఆ వృత్తికి చెందుతాడు కాని, దానికి మతానికి సంబంధం లేదన్నాడు. అలాగే బట్టులుతికేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు మొదలైనవారు. ఇతరులను మతం పేరుతో దోపిడీ చేసి బ్రతికేవాళ్ళు మతానికి సంబంధించిన వాళ్ళెవ్వరు. వాళ్ళు స్వార్ధపరులు, కపటులవుతారన్నాడు.
జ్యోతిరావు ఫూలే తన కాలానికన్నా ఎంతో ముందున్నాడు. స్త్రీల అభ్యున్నతి కోసం అంతగా పరితపించిన వ్యక్తి మనకు చరిత్రలో కనబడడు. జ్యోతిరావు తపన సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయం జరగనిదే రాజకీయ న్యాయం అర్ధవంతం అవదనుకున్నాడు. ఈ రోజున అదే జరుగుతోంది. శూద్రులు అధికారంలోకి వచ్చినా సామాజిక న్యాయం ఎండమావే అయింది. సామాజిక మార్పు కోసం కృషి చేయకుండా అందరూ రాజకీయ మార్పు జరగాలంటున్నారు. జోతిరావు కృషి అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆయన గురించి, ఆయన చేసిన కృషి గురించి విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన వంటి నిబద్ధత ఉన్న నాయకత్వం అవసరం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|