|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
నేను తెలుగు భాషీయుడనని, తెలుగువాణ్ణని చెప్పుకోవడానికి తగిన ఆత్మగౌరవ వాతావరణం కల్పించలేకపోయామని గమనించాలి. అందుకే ఇప్పుడు భాషోద్యమాలు తెలుగువారి ఆత్మగౌరవం దృష్ట్యా ఆలోచించవలసి ఉంది. సామాన్య ప్రజల గౌరవ హేతువులని కూడా పరిగణనలోకి తీసుకునే కాలం ఆసన్నమైంది. మనుషులకి గౌరవం ఇవ్వకుండా దూరం పెంచుతూ భాషా ప్రమేయంతో వారిని దగ్గరకు తీసుకురావడం సాధ్యమా. అయితే శిష్టులు మారితేనే తప్ప జనసామాన్యం తమ దృక్పథంలో మార్పు తెచ్చుకోలేరు. అందుకే రెండు వైపుల నుండీ సంసిద్ధత ఉంటేనే 'తెలుగు వ్యవస్థ' (భాష, జాతి, సంస్కృతి, సమాజం) బాగుపడుతుంది. లేదా ఎవరి హద్దుల మధ్య వారు ఉండిపోక తప్పదు. రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రాంతాలలో వెనుకబడిన చిన్న ప్రాంతాలు, సమూహాలు విడివిడిగా అలాగే ఉండిపోతాయి.
చరిత్ర నుండి గుణపాఠాలు తీసుకోవడం అంటే ఆత్మవిమర్శ చేసుకోవడమే. మన వేలాది ఆత్మ విమర్శల్లో భాషకి సంబంధించి ఒక్క పత్రం ఉన్నా ఎంత బాగుండేది?
మనుషుల్ని కలిపే సహజసిద్ధమైన భాషలో బోలెడు అంతరాలున్నాయి. వీటిని రూపుమాపడం అంటే నిజమైన సామాజిక ఉద్యమాలు, ఆర్థిక పోరాటాలు సరికొత్త ప్రజా స్వభావ అధ్యయన ప్రణాళికతో, కొత్త చూపుతో - భాష, సంస్కృతి, సమాజం వంటి అంశాలను కలుపుకోవాలి. కలగలిపే తత్వం ఉన్నప్పుడే భాష వికసిస్తుంది. ప్రజాస్వామీకరించబడుతుంది. అప్పుడు సామాన్యుడు నేను తెలుగువాణ్ణి అంటాడు. తెలుగుజాతి జిందాబాద్ అనే నినాదం ఊరూ వాడా ప్రతిధ్వనిస్తుంది. సరిహద్దులకావలే కాదు... విదేశాలలో కూడా మారుమోగుతుంది.
ఇప్పుడు భాషోద్యమాలే ప్రగతిశీల పోరాట ఉద్యమాలకీ గీటు రాళ్ళు. ప్రగతిశీలం మేకప్ తో ఆధునిక దుస్తుల్లో కనిపించినా ఒక వాక్యాన్ని బట్టి అసలు తత్వాన్ని, స్వభావాన్ని భాష పట్టిస్తుంది. భాష ఈ నాటి సరికొత్త పేలుడు పదార్థం. అందుకే జాగ్రత్తగా మసలడం అవసరం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|